మాజీ కౌన్సిలర్ దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్
పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవి శనివారంతో పూర్తి అయిపోయింది 2020 నుండి 25 సంవత్సరాల పాలకవర్గానికి 4వ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదించి గెలిపించిన వార్డు ప్రజలకు ఓటర్లకు అందరికీ పేరుపేరునా 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ దంపతులు దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పురపాలక సంఘం పరకాల పట్టణంలో వాస్తవానికి పరిపాలన కాలంలో రెండు సంవత్సరాలు కరోనా వలన ఎలాంటి కార్యక్రమాలు లేకుండా పోయాయని మిగిలిన మూడు సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ,ఇప్పటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి నిధులు అందకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో వార్డులో అభివృద్ధి పనులు చేయలేకపోయామన్నారు. మమ్మల్ని అర్థం చేసుకొని మన్నిస్తారని వేడుకొన్నారు వార్డులో నిధుల ఎంతగా కొరత ఉన్నప్పటికీ పురపాలక చైర్మన్,పాలకవర్గం ల్,పురపాలక అధికారుల సహకారంతో రాజీపేట దళిత కాలనీలోని మోరే రమేష్, సారంగపాణి ఇంటి గల్లీలో సిసి రోడ్డు నిర్మాణం చెత్తడం,కరెంటు పోల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా పరకాల చరిత్రలోనే మొదటిసారిగా పరకాల సగర వీధిలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపాట్టాము డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హాస్పిటల్ నుండి భూపాల్ పల్లి మెయిన్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు చేసి,30 ఫీట్లు రోడ్డు అలాగే డ్రైనేజీ కాలువలు నిర్మించడం జరిగిందని దానికి సగరవీధి ప్రజలందరి స్వచ్ఛంద సహకారం మరువలేనిదని,తాడిశెట్టి రజనీకాంత్ ఇంటి నుండి లింగాల సత్యం ఇంటి వరకు ఆ వీధి ప్రజల సహకారంతో రోడ్డు వెడల్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో డ్రైనేజీ రోడ్డు నిర్మాణం నిధుల కొరత వలన చేయలేకపోవడం కొంత బాధగానే ఉందన,అంతేకాక తాటిశెట్టి రజనీకాంత్,లింగాల సత్యం ఇంటి గల్లీలో మరియు గడ్డం వాడలో రోడ్డు,మురికి కాలువ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఆ పనులు చేయలేకపోయామని ఊర్వశి థియేటర్ ప్రగతి నగర్ కాలనీకి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పాత సిఎంఎస్ గోడౌన్ క్రాస్ నుండి వచ్చే కాలువ వలన వరద ఇబ్బందులకు ఆ కాలనీవాసులు గురికావాల్సి వచ్చింది కాలనీలో సంవత్సరం మొత్తం బురద ఇబ్బందులు తప్పడం లేదని గత ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన వారు కంటి తుడుపు మాటలు మాట్లాడడం మినహా ఏ రోజు స్పందించలేదు కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే పరిస్థితిని వివరించడంతో అర్థం చేసుకొని ఓల్డ్ సి ఎం ఎస్ గోడౌన్ క్రాస్ నుండి ధర్మారెడ్డి సామిల్ వరకు పెద్ద డ్రైనేజీ నిర్మాణానికి టాఫ్డ్ కో నిధులుకేటాయించడం హర్షనీయమని ఆపనులు కూడా త్వరగా పూర్తి చేయాలని పురపాలక సంఘం పదవిలో ఉన్నా,లేకున్నా ప్రభుత్వ పథకాల అమలులో వార్డు ప్రజల వెంటే ఉంటూ అర్హులకు న్యాయం జరిగేలా చూడడానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు.2014-19 ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపించి పట్టణానికి వైస్ చైర్మన్ గా సేవలు అందించే ధన్యత కలిగించినందుకు,అదేవిధంగా 2020-25 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి గెలిపించినందుకు వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.