కామారెడ్డి జిల్లా /బాన్సువాడ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు పాల్గొని 181 లబ్ధిదారులుకు చెక్కులను పంపిణీ చేశారు.
మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు:
– బాన్సువాడ పట్టణ: 41 లబ్ధిదారులు, రూ.41,04,756/-
– బాన్సువాడ గ్రామీణ మండలం: 77 లబ్ధిదారులు, రూ.77,08,932/-
– నసరుల్లబాద్ మండలం: 32 లబ్ధిదారులు, రూ.32,03,712/-
– మోస్రా మండలం: 31 లబ్ధిదారులు, రూ.31,03,596/
-మొత్తం 181 లబ్ధిదారులకు రూ.1,81,20,996/- రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎల్లప్పుడు ప్రజల మేలుకొరకు ఆరాటపడుతుందని, అందులో భాగంగానే కొత్త కొత్త ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని అర్హులందరూ కూడా యిట్టి పథకాల ద్వారా లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్యామల శ్రీనివాస్, వర్నీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా
ఆయా మండలాల తహసిల్దార్లు
బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నసురల్లాబాద్, మోస్రా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.