పల్లెల్లో తల్లడిల్లుతున్న ప్రకృతి వనాలు

మందుబాబులకు అడ్డాలుగా మారుతున్న వనాలు

పరకాల నేటిధాత్రి
తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఓ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.మొక్కలు నాటి వాటి నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించింది.సర్పంచు ల కాలం ముగిసిన తరువాత ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ అక్కడ ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుదని చెప్పవచ్చు,కొన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ సిబ్బంది వాటి రక్షణ విషయం పక్కన పెట్టి మాకేం పట్టదు అన్నట్టుగా వాటి బాధ్యత వారిది కాదన్నట్టుగా వ్యవహారిస్తున్నారు.మరికొన్ని పల్లె గ్రామాల్లో ప్రకృతి వనాల నిర్వహణ కరువై చెట్లు ఎండుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పవచ్చునీటి సౌకర్యం లేక పలు గ్రామాల్లో మొక్కలు ఎండిపోతున్న కారణంగా అటువైపు వెళ్లడం లేదు.ఒకటి,రెండు గ్రామాల్లో మినహా పల్లె ప్రకృతి వనాలలో నాటిన మొక్కలు ఆకర్షించేవిగా లేవని ప్రజలు వాపోతున్నారు.ఆహ్లాదాన్ని నింపేలా,సేద తీరేలా, సుందరీకరణ మొక్కలు, పండ్లు,నీడనిచ్చే మొక్కలు నాటాలని ప్రణాళికలో పొందుపర్చారు.కానీ ఆ పరిస్థితి ఏ పల్లెలో కనపడటం లేదని చెప్పవచ్చు.

మందు బాబులకు అడ్డాలుగా

ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఊరికి దూరంగా ఉండడంతో మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.కొన్ని చోట్ల మార్నింగ్ వాక్ కోసంవెళ్తే అక్కడ మందు బాటిల్లు దర్శనమిస్తున్నాయని ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ల్,మార్నింగ్ వాకార్స్ కు ఆహ్లాకార వాతావరణాన్ని ప్రకృతి వనాల్లో ఏర్పడేవిధంగా చర్యలు తీసుకోవాలని అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామాల పంచాయతీ సిబ్బంది,ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!