-సంగం వెంకట పుల్లయ్య మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ,
“ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించింది. అనంతరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది.మన రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించి, మౌలిక హక్కులను కాపాడుకుంటూ, ప్రాథమిక విధులను నిర్వర్తిస్తూ, దేశం అభివృద్ధి సాధించి అగ్రగామిగా నిలపాలని” ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంనకు
ముఖ్య అతిథులుగా హాజరైన
శ్రీ రామకృష్ణ సమితి భద్రాచలం అధ్యక్షురాలు మువ్వా దమయంతి
మరియు
టీజీవో అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కామేశ్వరరావు మాట్లాడుతూ
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్టిఏ సిబ్బంది పాషా, మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని, దేశ సేవలో తమ బాధ్యతను గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పించారు.
రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందరికి అందాలి -దేశం అగ్రగామిగా నిలవాలి
