కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

నిరుపేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి.

మాకు పట్టా ఉంది ఖాళీ చేయాలని వేదిస్తున్న అక్రమార్కులు.

వేధింపులు భరించలేక మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాధితుడు.

సిపిఐ ఎంల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 290లో గత 30 సంవత్సరాలనుండి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలనుండి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న అధికారులు నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకపోవడం మూలంగా కొంతమంది అక్రమార్కులు రంగప్రవేశం చేసి అట్టి భూమి వారికి పట్టా అయ్యిందని వేంటనే ఖాళీ చేయాలని, లేదంటే మా దగ్గర కొనుగోలు చేసుకుని నివాసం ఉండాలని లేదంటే గుడిసెలను తీసివేస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నారని అన్నారు.ఇట్టి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇంటి స్థలం కోసం ఒక ప్రాణం పోయినా అధికారుల్లో చలనం లేదని,అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని అసైండ్ భూమి అమ్మడం కొనుగోలు చేయడం నేరం అని చట్టం చెపుతున్న, వారు ఇష్టానుసారం అసైండ్ భూములు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఇట్టి విషయంపైన స్థానిక తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని, నిరుపేదలు ఇంటి స్థలాల కోసం అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి మోకా సర్వే చేయించి నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంల్ లిబరేషన్ పట్టణ కార్యదర్శి చంద్రగిరి శంకర్,జిల్లా కమిటి సభ్యులు కన్నూరి డానియేలు, తాత సమ్మక్క, పర్లపల్లి కోమల, సారమ్మ, బొల్లి పోషమ్మ, రమ్య, దొడ్డే శ్రావణి తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!