శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని గట్లకానిపర్తి గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. నేటి ధాత్రి పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యన్న చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటిధాత్రి 20 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పత్రిక రంగంలో దూసుకుపోతూ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వారధిగా నిలుస్తూ ఎన్నో ప్రశంసలు పొందుతుందని రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై మరిన్ని వార్త కథనాలు రాసి ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ,ఫణి చంద్ర రాజకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.