“నేటిధాత్రి” రామగుండం.
76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ పద్మావతి కాలనీలో కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు* జెండా ఆవిష్కరించారు.
కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగునూరి సుమలత- రాజు ను డివిజన్ ప్రజలు శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం వినూత్నంగా ఐదు సంవత్సరాలు తన వెన్నంటి ఉండి డివిజన్ కు ఎనలేని సేవలు అందించిన వారిని గుర్తించి శానిటేషన్, రోడ్లు ఊడ్చిన వారికి డ్రెయిన్ క్లీనర్, మంచినీటి సరఫరా చేసిన వారికి మరియు తడి- పొడి చెత్త సేకరించిన కార్మికులకు శానిటేషన్ సూపర్వైజర్లను అభినందించారు.ఈ సందర్భంగా వారి అందరిని కార్పొరేటర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఐదేళ్ళ పాటు తమతో ప్రయాణించినందుకు వారిని కొనియాడుతూ ఇంకా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి విషయంలో 25వ డివిజన్ ఎక్కడలేని విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు.
డివిజన్ ప్రజలకు రోడ్లు డ్రైన్లు వీధిలైట్స్ డివిజన్లో ఎల్ఈడి లైటింగ్ తో పాటు బొడ్రాయి, కార్యక్రమం 24 గంటలు మంచినీటి సరఫరా డివిజన్‌లో చెత్త లేకుండా చేసే కార్యక్రమంలో డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేశామని ఈ ఒక డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రాబోయే కాలంలో మీరు సహకరిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని డివిజన్ ప్రజలందరికీ ఈ సభ వేదికగా మాట ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కమిటీ సభ్యులు స్థానిక ప్రజలందరూ పాల్గొన్నారు.