పండుగ వాతావరణంలో ప్రారంభమైన నాలుగు సంక్షేమపథకాలు
లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అంద జేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభు త్వం పనిచేస్తోందని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవాల సందర్భంగా శాయంపేట మండలం లోని గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన పథకాల ప్రారంభో త్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అన్ని గ్రామాలల్లో పండుగ వాతావరణంలో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు జరగగా, అతిథులకు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, టపాసులు పేల్చి, మహిళలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. వేదికలలో ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరా యంగా అందజేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పేద, ధనిక తేడా లేకుండా చేయడమే ప్రజాస్వామ్యమని, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించ డంతో పాటు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోనా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ప్రొసిడింగ్ అందజే యడం సంతోషంగా ఉంద న్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధి కోసం ఎప్పుడైనా అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పథకాల అమలులో రాజకీయాలు చేయకుండా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు. ప్రజలందరు ఆశీర్వదించి ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన పదమూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోయి నా, పేదల జీవితాలలో వెలు గులు నింపటానికి దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.22 వేల కోట్లతో రైతులకి రుణమాఫీ చేశామని, సాగు చేసే ప్రతీ ఎకరానికి రైతు భరోసా కింద రూ.12 వేలు పెట్టుబడి సాయం నేటి నుండి ఇస్తున్నట్లు తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నా మని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంత ఇంటి కల నెరవేరబోతుందని, అర్హు లైన నిరుపేదలకు ఇండ్లు నిర్మాణానికి దశల వారిగా రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గత పదేండ్లుగా ఇవ్వని రేషన్ కార్డులు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చాక, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిరంతరం దరఖాస్తులు స్వీకరిస్తున్నా మన్నారు. పరిశీలన చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులని గుర్తించాలని సూచించారు. అందరికి సంక్షేమ పథకాలు అమలు చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని క్యాబినెట్ నిరంతరం కృషితో సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరే విధముగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ నాయకులు,కార్య కర్తలు,అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.