రైతులకు శిక్షణ కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో ప్రజ్వల్ ఎఫ్.పి.సి.ఎల్ ఆధ్వర్యంలో ప్రజ్వల్ ప్రతినిధి ఎస్కే గౌస్ బి సి ఐ రైతులకు భూసార అభివృద్ధి గురించి నేల పునరుత్పాదక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. రైతులందరూ వ్యవసాయ భూముల్లో నిరంతరం పోషకాలను అందించాలన్నారు సేంద్రియ కర్బనo తక్కువగా ఉండడం మూలాన దిగుబడులు సరిగారాక ఎరువుల ఖర్చులు మరియు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు విశ రసాయన ఎరువులు పురుగుమందులను అత్యధికంగ వాడటం మూలన సారవంతమైన నేల క్షీణించి చౌడునేలలుగా మారు తున్నాయని వ్యవసాయ భూముల్లో తిరిగి పునర్జీవం వచ్చి తిరిగి సారవంతమైన భూములుగా మారుటకు గాను రైతులు పచ్చి రొట్టె ఎరువులు కంపోస్టు సేంద్రియ ఎరువులు పప్పు జాతి పంటలు అంతర పంటలు చెరువు మట్టి పశువుల పెంట పశువుల మందులు కోడి ఎరువు పంట పొలాల్లో వేసుకొని నెలలో సేంద్రియ కర్భణాన్ని పెంచుకోవాలని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివరించడం జరిగింది ప్రజ్వల్ సంస్థ వారు అందిస్తున్న సిటీ కంపోస్టును రైతులు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని వాటి ఆధారంగా ఎరువులను వేసుకోవాలని తద్వారా వృధా ఖర్చులను తగ్గించుకోవచ్చని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు బోనెపల్లి రాజిరెడ్డి, వైద్యుల సమ్మిరెడ్డి ,సంజీవరెడ్డి, పింగిలి రాజిరెడ్డి ఎలమంచి ఆదిరెడ్డి లోకల్ బోయిన కుమారస్వామి చిలువేరు మల్లేశం ప్రజ్వల్ సంస్థ క్షేత్ర సిబ్బంది తరాల తిరుపతి పోతు సునీల్, పల్నాటి రాంబాబు, పోరండ్ల భానుమతి, బైకని ప్రశాంత్ మోటే మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *