వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులకు ఆహ్వానం.

# జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం ప్రకటన..

నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్దతిలో
డిసెక్షన్ హాల్ అటెండర్ల – 4 పోస్టులు
పోస్ట్ కోసం అర్హత 10వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని అలాగే,అనాటమీ డిసెషన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో కనీసం 1 సంవత్సర అనుభవం ఉండాలని పేర్కొన్నారు.ల్యాబ్ ఆటెండర్లు 4 పోస్టులను గాను
పోస్ట్ కోసం అర్హత కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ ఎంఎల్టి లేదా డిఎంఎల్టిలో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి తప్పనిసరిగా తెలంగాణ పారామెడికల్ బోర్డుతో గుర్తింపు పొందాలని వివరించారు. తియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ -4 పోస్టులకు గాను పోస్ట్ కోసం అర్హత అనస్థీషియా అసిస్టెంట్ కోర్సులో బీఎస్సీఎంఎల్టి లేదా డిఎంఎల్టిలో ఉత్తీర్ణులై ఉండాలని తెలంగాణ మెడికల్ బోర్డుతో గుర్తింపు పొంది ఉండాలని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ లను పూరించి మీ మీ దరఖాస్తు ఫారాలను
నర్సంపేటలోని ఏరియా ఆసుపత్రిలో సమర్పించంలని కలెక్టర్ తెలిపారు.ఈ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 24 సాయంత్రం 5 గంటల
లోపు ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికేట్లను సమర్పించిన దరఖాస్తులను పరిగణ లోకి తీసుకోబడునని వివరించారు.
మెరిట్ మరియు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించినప్పుడల్లా అనుసరించబడతాయని అన్నారు.
ఏదైనా క్వారీల కోసం 08718-230226 నంబర్ సంప్రదించాలని కలెక్టర్ ప్రావీణ్య ప్రకటన ద్వారా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *