4లేబర్ కోడ్స్, జిబి జీ రామ్ జి చట్టం రద్దు చేయాలి…

4లేబర్ కోడ్స్, జిబి జీ రామ్ జి చట్టం రద్దు చేయాలి

విజయవంతం అయిన జాతీయ సమ్మె

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

4 లేబర్ కోడ్స్,జిబిజి రామ్ జి చట్టం, విత్తన చట్టం రద్దు చేయాలని,8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని పిలుపు నిచ్చిన జాతీయ సమ్మె విజయవంతం అయ్యిందని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్,ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ( ఎఐసిసిటియు )జిల్లా కార్యదర్శి కన్నూరి దానియెల్ కోరారు. ఈ సందర్బంగా వారు టేకుమట్ల మండల కేంద్రంలో మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన 4లేబర్ కోడ్స్ రద్దు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జిబిజి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించు కోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ సంపూర్ణ మద్దతు తెలిపారు.కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు మచ్చ రాజయ్య, మారపెల్లి కొమురయ్య, రామ్ కుమారస్వామి, రాం వర్ధన్, తిప్పనవేని యుగేందర్,సముద్రాల సరోత్తమ్, ఎలుకటి జంపయ్య, ఎలుకటి కుమార్, జీడీ ఈశ్వర్, మల్లా రెడ్డి, కనుమల్ల సారయ్య,ఇచ్చాంతుల కృష్ణ, ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు ఐరెడ్డి తిరుమల, సరిత, శాంత, రమ, విజయ తదితరులు పాల్గొన్నారు.

గాదె ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం..

గాదె ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం

మారపెల్లి మల్లేష్
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. ఆదివారం జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలో ఎన్ఐఏ పోలీసులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం, ఆయనపై అక్రమ కేసులు పెట్టడాన్ని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తుందని, మావోయిస్టులు చర్చలకు సిద్ధపడినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా లేదని, ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకిస్తున్న మేధావులపై, ప్రజాస్వామిక వాదులపై కక్షపూరిత వేధింపులకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన విమర్శించారు. అందులో భాగంగానే గాదె ఇన్నయ్యపై కేసులు బనాయించారని, వెంటనే కేసులను ఉపసంహరించుకొని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టేకుమట్ల మండల కేంద్రంలోని ఇసుక క్వారీ రద్దు చేయాలి….

టేకుమట్ల మండల కేంద్రంలోని ఇసుక క్వారీ రద్దు చేయాలి

ఎలుకటి రాజయ్య టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండల కేంద్రం చలివాగులోని ఇసుక క్వారీని రద్దు చేసి సహజ వనరులను కాపాడాలని టీఎస్ టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ,సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ లు కోరారు. ఈ సందర్బంగా వారు చలివాగులోని ఇసుక క్వారీని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక దందా జరుగుతుందని, ఒక ట్రిప్పుకు పర్మిట్ తీసుకుని అనేక ట్రిప్పులు ఇసుక రాత్రి అనక పగలు అనక తరలిస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారని,ఇసుకను విచ్చలవిడిగా డంపులు చేస్తూ లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారని అన్నారు.ఈ దందా చేస్తున్న అధికారపార్టీ, మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు మండల ఉన్నత అధికారులపై ఒత్తిడి చేసి పర్మిట్లు ను మరియు పట్టుబడిన వాహనాలను విడిపించుకుంటున్నారని, చిట్యాల మరియు రేగొండ మండలాలకు సంబందించిన ట్రాక్టర్లు అధిక సంఖ్యలో డంపులు చేస్తూ ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు.కంచె చేను మేస్తే కాపాడేవారు ఎవరు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతుందని, ట్రాక్టర్ డ్రైవర్లు అధిక వేగంతో, ఇష్టరీతిన నడుపుతుండటం మూలంగా దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ దందా ఈవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో సాగు, తాగు నీరుకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని, ఇకనైనా అధికారులు స్పందించి టేకుమట్ల ఇసుక క్వారిని రద్దు చేసి టేకుమట్ల ప్రాంత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మాత్రమే పర్మిట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version