టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా…

టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు

సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డును వెంటనే అమలు చేయాలి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిబిజికేఎస్ సంఘం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,టీబీజీకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి,వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టిబిజికెఎస్ నాయకులు, బడిదల సమ్మయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత బిఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్దత లేని సమయంలో, 115 మెడికల్ బోర్డుల ద్వారా 13,119 మంది కార్మిక బిడ్డలకు కారుణ్య నియామకాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
నేటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడాది కాలంగా (మార్చి 2025 నుండి) ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించకుండా 2000 మంది అనారోగ్యంతో ఉన్న కార్మికుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం అడుతుంది.

సింగరేణిలో ఇచ్చిన గ్యారంటీలు నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కడం అన్యాయం.
వారసత్వ ఉద్యోగాల వల్ల సింగరేణి కుంటుపడిందని చెప్పడం అబద్దం! ప్రభుత్వం చెల్లించాల్సిన 50 వేల కోట్ల బకాయిల వల్లే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మారు పేర్ల విజిలెన్స్ అంశం పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి.అక్టోబర్ 2025 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ నియమక పత్రలు వేంటనే ఇవ్వాలి.
బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైకరి నశించాలి..
తెలంగాణ బొగ్గు గణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ సంఘం పిలుపునిచ్చారు

మెడికల్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలి…

మెడికల్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలి…

టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సింగరేణిలో యధావిధిగా మెడికల్ బోర్డు నిర్వహించాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు.శనివారం టీబీజీకేఎస్ యూనియన్, బిఆర్ఎస్ నాయకులు కలిసి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ మధు కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ మాట్లాడారు. ఏసీబీ విచారణ పేరుతో మెడికల్ బోర్డును నిలిపివేయడం సరికాదని అన్నారు. ఏసీబీ, విజిలెన్స్ పేరిట మెడికల్ బోర్డును కాలయాపన చేయడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వ తీరును కార్మిక లోకమంతా గమనించాలన్నారు .ప్రభుత్వం స్పందించి వెంటనే మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 30న అన్ని ఏరియా ల జిఎం కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కృష్ణ, సురేష్, దబ్బేటి సంతోష్,బిఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, జాడీ శ్రీనివాస్,మహేందర్ రమేష్, రామిడి లక్ష్మీ కాంత్ చంద్రకిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్స్ రద్దు…పని గంటల తగ్గింపుకై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి.

 

లేబర్ కోడ్స్ రద్దు…పని గంటల తగ్గింపుకై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి.

ఎం శ్రీనివాస్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు పని గంటల తగ్గింపు కనీస వేతనాలపై మరిన్ని సమరసిల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
2025 ఆగస్టు 4న అమీనాపురంలో జరిగిన ఐ ఎఫ్ టి యు మహబూబాద్ జిల్లా కమిటీ సమావేశం కు హాజరై జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల కు అనుకూల విధానాలను రూపొందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ముమ్మరం చేసిందనీ అన్నారు. ముఖ్యంగా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల భాగంగా రైతులకు భూమిపై హక్కులు నిరాకరిస్తూ కార్మిక వర్గానికి ఉన్న మౌలిక హక్కులను రద్దు చేస్తూ మూడు నెలల సాగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ ను ముందుకు తెచ్చిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా దాని ఆధారంగా వచ్చిన చట్టాలను భారత ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను బుట్ట దాఖలు చేస్తూ కనీస వేతనాలను సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితులు వర్ణనాతీతం అని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెలు చేపట్టిందని దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలపై కార్మిక వర్గం బలమైన సమస్యల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆగస్టు 16 17 తేదీలలో కేసముద్రం మండల కేంద్రంలో జరిగే ఐ ఎఫ్ టి యు రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆ మేరకు తగిన ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆగస్టు 16 17 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల నిర్మాణపు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా కార్మికులు వ్యాపార వాణిజ్య వర్తక వర్గాలు సహకరించి తోడ్పడవలసిందిగా శ్రీనివాస్ కోరారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వత కోటేష్, శివారపు శ్రీధర్, సీనియర్ నాయకులు హెచ్ లింగ్యా, ఏపూరి వీరభద్రం,
ఎం నాగేశ్వరరావు,
జబ్బార్,తేజావత్ శోభన్,
అల్లి యాకాంబరం బట్ట మేకల రాజు, మిట్ట గడుపుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version