జైపూర్ మండలంలో మీసేవ కేంద్రాల పనితీరుపై తహసీల్దార్ సమీక్ష

జైపూర్ మండలంలో మీసేవ కేంద్రాల పనితీరుపై తహసీల్దార్ సమీక్ష

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో తహసీల్దార్ వనజ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం మాత్రమే దరఖాస్తుదారుల నుండి రుసుములు వసూలు చేయాలని స్పష్టం చేశారు.దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా సమర్పించి,సంబంధిత పత్రాలను సక్రమంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.అలాగే ప్రతి మీసేవ కేంద్రంలో సిటిజెన్ చార్టర్ బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కేంద్రానికి వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్,గిర్దావర్‌లు,గ్రామ పాలనా అధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం…

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్ధుల నుండి వివిధ ఆర్ధిక సహాయ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం కింద ఈవీ టూ వీలర్ ఈవీ త్రీ వీలర్ వాహనాలకు, అలాగే వ్యవసాయ పథకాల కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 50 ఏళ్ల వరకు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుండి 60 ఏళ్ల లోపు ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 మించకూడదు. సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి. ఈవీ ద్విచక్ర వాహనాల కోసం జొమాటో, స్విగ్గీ, రాపిడో వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, వారు సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీసేవ ద్వారా పొందిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్లతో ఈ నెల 17 నుండి 24 వరకు ఆన్లైన్ వెబ్సైట్ tsobmms.cgg.gov.in ద్వారా లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి…

మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లోని మీ సేవ కేంద్రాల యాజమాన్యాల దోపిడి నుండి వేలాది మంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కాపాడాలని కలెక్టర్ కి సోమవారం విజ్ఞప్తి చేశారు.ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విశ్రాంత సింగరేణి ఉద్యోగులు పెన్షన్ దారులు జిల్లాలోని మీ సేవ కేంద్రాలలో జీవన్ ప్రమాణ్,డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ తీసుకుంటేనే సింగరేణి పెన్షన్ దారులకు ప్రతి నెల వారి వారి బ్యాంకు ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని తెలిపారు.సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చిన విధంగా,ఇష్టరిత్య ఒక్కొక్క మీ సేవా కేంద్రాల ఎజమానులు ఒక్కో పెన్షన్ దారు నుండి 200,150,100 రూపాయిల వరకు తీసుకుంటూ చదువురాని సింగరేణి విశ్రాంత పెన్షన్ దారులను దోపిడీకి గురి చేస్తున్నారని వాపోయారు.ఒక కోల్ మైన్స్ పెన్షన్ కు 50 రూపాయిలు సిపిఎంఆర్ఎస్ ఉద్యోగి వారి జీవిత భాగస్వామికి సంబంధించిన మెడికల్ హెల్త్ కార్డు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ కు 75 రూపాయిలు తీసుకునే విధంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల యజమానులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, జిల్లా నాయకులు ఏ.గంగయ్య ,బియ్యాల ప్రభాకర్ రావు ,జెడి బీరయ్య, సిహెచ్.వైకుంఠం,కె.రాజిరెడ్డి, డి.సాయిలు,కస్తూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు .

హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈనెల 12వ తేదీ వరకు పెంచారు. అడ్మిషన్ ఫీజును మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని, నేరుగా అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version