స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తి…

స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తి

రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్‌ లోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ,స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ వివేకానంద ఆశయాలు, ఆలోచనలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశ గొప్ప చరిత్రను గుర్తించేలా చేసిన మహానుభావుడు స్వామి వివేకానందని తెలిపారు.యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్,బియ్యాల సతీష్ రావు,ఆకుల అశోక్ వర్ధన్,తుల ఆంజనేయులు,అవిడపు రాజబాబు, బుద్దారపు రాజమౌళి,బింగి సత్యనారాయణ,మెరెడికొండ శ్రీనివాస్,వెలుముల దుర్గా ప్రసాద్,కాశెట్టి నాగేశ్వర్ రావు,బూర్ల చిరంజీవి,బోయిని దేవేందర్,అరె సతీష్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ…

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,
యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి రఘు, ఆర్డీఓ హరికృష్ణ, యువజన సర్వీసులు శాఖ సిబ్బంది సాగర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఫోటోకు పూల మాలలు వేసి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మోడీ రవీందర్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద వారి బాటలో నడవాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈకార్య క్రమంలో ఉపసర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు బక్కశెట్టి రాజయ్య, తడగొండ శేఖర్, నీలం పరశురామ్, పన్యాల విద్యాసాగర్, మాజి సర్పంచ్ పాకాల రాములు, తడగొండ త్రినాథ్ వర్మ, బైరి అంజయ్య,పాదం సాగర్, శ్రీనివాస్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమావళి పాటించాలి…

రోడ్డు భద్రత నియమావళి పాటించాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రోడ్డుపైన వాహనాలు నడుపుతున్నప్పుడు క్రమశిక్షణతో, బాధ్యతతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రత నేషనల్ యూత్ డే ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుండి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తిగారు ప్రసంగించారు. నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తే కఠిన శిక్షలు పడతాయని అన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాటి ఓనర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వెయ్యి మంది విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహనలో పాలుపంచుకోవడం అభినందనీయమని జడ్జి ఆనందాన్ని వ్యక్తం చేసారు. భవిషత్తులో బాధ్యతాయుత పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి.శ్రీనివాస్ డి.ఎస్.పి. సంపత్ రావు ఆర్.టి.ఓ. సందాని డి.ఈ.ఓ. రాజేందర్ సి ఐ నరేష్ కుమార్, ఎస్.ఐ. సాంబమూర్తి వెయ్యి మంది విద్యార్థులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version