యువతకి స్పూర్తి ప్రదాత స్వామి వివేకానంద-జాతీయ యువజన అవార్డు గ్రహీతలు..

*యువతకి స్పూర్తి ప్రదాత స్వామి వివేకానంద-జాతీయ యువజన అవార్డు గ్రహీతలు
రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు

రామడుగు, నేటిధాత్రి:

 

స్వామి వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత అని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు
రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు లు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రామడుగు మండలంలోని వెదిర గ్రామ పంచాయతీ పరిధిలోని వేదిర ఎక్స్ రోడ్డు స్వామి వివేకానంద చౌరస్తా వద్ద గల స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అయన విగ్రహనికి జాతీయ యువజన అవార్డు గ్రహీత అవార్డు అలువాల విష్ణు ఆధ్వర్యంలో మండలం లోని పలువురు ప్రజాప్రతినిధులను అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.
అనంతరం నూతనంగా గెలిచిన యువజన సంఘాల ప్రతినిధులను చేనేత శాలువ, మొక్కను అందజేసి జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణులు మాట్లాడుతూ భారతదేశానికి ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక గర్వకారణమైన మహానుభావుడు స్వామి వివేకానంద అని వారు పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన స్వామి వివేకానంద, యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలని తన బోధనల ద్వారా తెలియజేశారని వారు అన్నారు. “లేచిరండి… మేల్కొనండి లక్ష్యాన్ని చేరే వరకు ఆగవద్దు” అన్న ఆయన సందేశం నేటికీ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని వారు తెలిపారు.
విద్య అనేది కేవలం ఉపాధి కోసం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, మానవ విలువల అభివృద్ధికి ఉపయోగపడాలని స్వామీజీ బోధించారని గుర్తు చేశారు. శారీరకంగా, మానసికంగా, నైతికంగా బలమైన యువతే బలమైన భారతదేశాన్ని నిర్మించగలదని ఆయన నమ్మకం అని వారు అన్నారు. ఈసందర్భంగా దేశంలోని యువత అంతా స్వామి వివేకానంద ఆశయాలు, సిద్ధాంతాలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని వారు పిలుపునిచ్చారు. సమాజ సేవ, పేదల అభ్యున్నతి, జాతీయ సమైక్యతకు యువత ముందుండాలని వారు కోరారు.
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకుడు, యువతి దేశ నిర్మాణంలో భాగస్వాములై భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో రామడుగు ఎంపీఓ శ్రావణ్ కుమార్, సర్పంచులు శనిగరపు అంజన్ కుమార్, మోడీ రవి, మేకల మల్లీశ్వరి ప్రభాకర్ యాదవ్, రెండ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్లు, దుద్యాల రాజిరెడ్డి, కటకం మనీష్, యువజన సంఘాల సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అమీరశెట్టి భూమిరెడ్డి, ఎన్.ఎస్.ఎస్.జాతీయ ఇందిరా గాంధీ అవార్డు గ్రహీత రేండ్ల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు జవ్వాజి హరీష్, బొమ్మరివేణి తిరుపతి, శనిగరపు అర్జున్ కుమార్, లేఖ రాజు, అలువాల శంకర్, నాగుల రాజశేఖర్, పోచంపల్లి నరేష్, కొడిమ్యాల రాజేశం, అంబటి వినోద్, జవ్వాజి అజయ్, రెండ్ల అంజి, నేరెళ్ల మారుతి, పర్లపల్లి రాజు, నిట్టూ బీరయ్య, మహేష్, అశోక్ రెడ్డి, కిరణ్ తేజా, రేణికుంట బాపురాజు, మచ్చ రమేష్, మహేష్, అంజన్ కుమార్, స్వామి , శ్రీనివాస్, బాబు, తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలులో ఘనంగా వివేకానంద జయంతి…

నాగర్ కర్నూలు జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కేంద్రంలో పదో వార్డులో మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ అధ్యక్షతన జరిగిన వివేకానంద జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆయన బాల్యం నుండి ధైర్యం వివేకం సేవ వంటి గుణాలను కలిగిన వాడు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో వేదాంతం శాస్త్రములను తన ఉప న్యాసాల ద్వారా వాదనల ద్వారా క్రాంతి అతనికి ఉంది అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మతం ప్రాశాస్త్రం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు భారతదేశాన్ని ప్రేమించి భారతదేశ మళ్లీ తన ప్రాచీన ఒణ్యత్యాన్ని పొందాలని ఆశించిన ప్రముఖులలో స్వామి వివేకానంద ఒకడు అందరం వివేకానంద మార్గంలో నడవాలని సూచించారు అనంతరం కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు వృద్ధులకు రైసు నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే గారు వివేకానంద జయంతిని పునస్కరించుకొని వారి చేతుల మీదుగా ఇచ్చాడు ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్స్ వాసవి క్లబ్ ప్రముఖులు టౌన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తి…

స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తి

రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్‌ లోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ,స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ వివేకానంద ఆశయాలు, ఆలోచనలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశ గొప్ప చరిత్రను గుర్తించేలా చేసిన మహానుభావుడు స్వామి వివేకానందని తెలిపారు.యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్,బియ్యాల సతీష్ రావు,ఆకుల అశోక్ వర్ధన్,తుల ఆంజనేయులు,అవిడపు రాజబాబు, బుద్దారపు రాజమౌళి,బింగి సత్యనారాయణ,మెరెడికొండ శ్రీనివాస్,వెలుముల దుర్గా ప్రసాద్,కాశెట్టి నాగేశ్వర్ రావు,బూర్ల చిరంజీవి,బోయిని దేవేందర్,అరె సతీష్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు

నేడు రక్తదాన శిబిరం..

నేడు రక్తదాన శిబిరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 11: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న స్థానిక పద్మశాలి భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పద్మశాలి యువజన సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 8.30 నుండి 1.00 వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందని, 60 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఎవరైనా ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేయవచ్చని పేర్కొన్నారు. రక్తం దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదాతగా నిలుస్తారని శిబిరంలో రక్తదానం చేసినవారికి ధ్రువపత్రం కూడా జారీ చేయబడుతుందని వివరించింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రావాలని పిలుపునిచ్చింది.

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ…

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,
యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి రఘు, ఆర్డీఓ హరికృష్ణ, యువజన సర్వీసులు శాఖ సిబ్బంది సాగర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఫోటోకు పూల మాలలు వేసి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మోడీ రవీందర్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద వారి బాటలో నడవాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈకార్య క్రమంలో ఉపసర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు బక్కశెట్టి రాజయ్య, తడగొండ శేఖర్, నీలం పరశురామ్, పన్యాల విద్యాసాగర్, మాజి సర్పంచ్ పాకాల రాములు, తడగొండ త్రినాథ్ వర్మ, బైరి అంజయ్య,పాదం సాగర్, శ్రీనివాస్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version