మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజాస్వామాలపై మాట్లాడండి

దళిత నాయకుడు కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు అసహ్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించిన కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యం అన్నారు ప్రజా ప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ రాజకీయాలను నిదర్శనం అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిన ప్రతిక్షణం చట్టసభల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అదేవిధంగా దళిత సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు వెంకటపురం సర్పంచ్ కేశవరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ఏరా సురేష్, గోగ్గలి రవి, భూక్యరాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ..

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రోను రద్దు చేసి.. రేవంత్‌రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై కాంగ్రెస్ నేతలు దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట సమతా కాలనీలో కేటీఆర్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version