అయ్యప్పస్వామి దేవాలయంలో వైభవంగా పడిపూజ..

అయ్యప్పస్వామి దేవాలయంలో వైభవంగా పడిపూజ

18 వ రోజుకు చేరుకున్న మహా అన్నదాన కార్యక్రమాలు

కన్నుల పండుగగా అయ్యప్పస్వామి అభిషేకాలు

వేలాదిగా హాజరైన మలాదారులు, భక్తులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో 25 వ రజతోత్సవ మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ వైభవంగా జరిగింది. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా సమక్షంలో నర్సంపేట పట్టణానికి చెందిన అన్నదమ్ములు మల్యాల శ్రీలత రాజు,సాగరిక ప్రవీణ్ కుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు పడిపూజను చేపట్టగా దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో అయ్యప్పస్వామి పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై గణపతిహోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు

 

 

 

చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు కళాశాభిషేకాలు చేయగా భక్తులు ఎంతగానో తరించిపోయారు.అయ్యప్ప స్వామిపైన వివిధ రకాల పుష్పాలతో సామూహిక పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవాలయం పదునెట్టాంబడిపై కర్పూరలో వెలిగించగా జ్యోతిరూపంలో కనిపించగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగింది.మండల పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం సోమవారం నాటికి 18 వ రోజుకు చేరుకున్న తరుణంలో అన్నదాతలుగా తుమ్మ రజిత రమేష్, సాయికిరణ్, బ్రాహ్మణపల్లి సునీత సుమన్, సింగరికొండ సుష్మ సతీష్ అభిరామ్ లు ఉన్నారు.

వేలాదిగా హాజరైన మాలాదారులు,భక్తులు

దేవాలయంలో నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ మహోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న పడిపూజలు అన్నదాన కార్యక్రమాలకు రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నది.సోమవారం మల్యాల శ్రీలత రాజు,మల్యాల సాగరిక ప్రవీణ్ కుమార్ దంపతుల చేపట్టిన మహా దివ్య పడిపూజకు సుమారు 3 వేల మంది భక్తులు,అయ్యప్ప మాలాదారులు భక్తులు హాజరుకాగ ఆలయం కిక్కిరిసిపోయింది.ఈ కార్యక్రమంలో
ట్రస్ట్ సభ్యులు దోమకుంట్ల నందయ్య గురుస్వామి,శ్రీరాం ఈశ్వరయ్య భూపతి లక్ష్మీనారాయణ,బండారుపల్లి చెంచారావు,పాలకుర్తి శ్రీనివాస్,దొడ్డ వేణు,అనంతుల రాంనారాయణ, బీరం నాగిరెడ్డి,గురుస్వాములు సంజీవ రావు,బొట్ల నాగరాజు,యాదగిరి, రాయసాబ్,అంకూస్ గౌడ్, ఆలయ గుమస్తా దేశి రాము అర్చకులు ఫ్రాన్స్,శివాంకిత్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

ఒక్కరోజే 86 మంది అయ్యప్పస్వామి దీక్షా

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి దీక్షా చెప్పట్టే మాలాదారులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది.కార్తీక సోమవారం ఒక్కరోజే 86 మంది స్వాములు అయ్యప్పదీక్షా చేపట్టారు.ఐతే అయ్యప్పస్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయ సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మాలధారణ చేపట్టిన స్వాములకు దీక్షా నియమాలను దేవాలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా వివరించారు.

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయ్యప్పస్వామి దేవాలయ సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 5 కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేపడుతున్నామని పేర్కొన్నారు.అదే రోజు కార్తీక దీపోత్సవం,అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version