జైపూర్ పోలింగ్ కేంద్రాల్లో డీసీపీ భాస్కర్ పర్యటన

ఎన్నికల పోలింగ్ స్టేషన్లను సందర్శించిన డీసీపీ భాస్కర్

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం లోని నర్వ,శివ్వారం గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్లను డీసీపీ భాస్కర్ శుక్రవారం సందర్శించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అనర్ధాలకు దారి తీయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని,ప్రజలు ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం జైపూర్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్,భీమారం,శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎన్నికలలో పాటించవలసిన నియమ నిబంధన గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వరరావు,జైపూర్ సిఐ నవీన్ కుమార్,శ్రీరాంపూర్ సిఐ శ్రీలత,జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, ఎస్సై లక్ష్మీ ప్రసన్న,భీమారం ఎస్సై శ్వేత ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి ఎంపీఓ బాపూరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కంది కొండ జాతర పనులు పరిశీలన

కంది కొండ జాతర పనులు పరిశీలన

డోర్నకల్ ఆర్సి నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం ఐన కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులో ఉన్న కందగిరి గుట్టపై కొలువు ఐన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మహా జాతర సందర్భంగా ఈనెల 5వతేదీన కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించనున్న మహ జాతర నేపథ్యంలో జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టిన పనులు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మాజీ జెడ్పీటిసి, కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ఈ కార్యక్రమంలో మరిపెడ సిఐ రాజ్ కుమార్ గౌడ్, సిరొలు ఎస్సై సంతోష్, విద్యుత్ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version