శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానంలో శివుని విగ్రహ భూమి పూజ
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానం నెహ్రునగర్ లో శివుని విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మకర్త,చైర్మన్ చిలుక నారాయణ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నెహ్రు నగర్ లో ఉన్న శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానం పరిధిలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి కృపతో శివుని విగ్రహా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం దాత దూడం శంకర్ భక్తుడు విరాళంతో మరియు భక్తుల భాగస్వామ్యంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగినది. అని తెలిపారు.
