పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

ఒక్కరోజే 86 మంది అయ్యప్పస్వామి దీక్షా

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి దీక్షా చెప్పట్టే మాలాదారులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది.కార్తీక సోమవారం ఒక్కరోజే 86 మంది స్వాములు అయ్యప్పదీక్షా చేపట్టారు.ఐతే అయ్యప్పస్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయ సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మాలధారణ చేపట్టిన స్వాములకు దీక్షా నియమాలను దేవాలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా వివరించారు.

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయ్యప్పస్వామి దేవాలయ సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 5 కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేపడుతున్నామని పేర్కొన్నారు.అదే రోజు కార్తీక దీపోత్సవం,అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version