పరమశివన్.
తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:
దళిత ప్రజలకు ఆశ్రయంగా నిలుస్తున్న శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరం హెచ్చరించారు. శనివారం తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఏపీ ఎస్సీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య తిరుపతి అంబేద్కర్ భవన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తామెంతో కృషి చేస్తున్నామన్నారు.అయితే కొందరు దుర్బుద్ధితో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళిత యువకులకు దళిత సంఘాలకు తాము ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.అలాగే నెలలో రెండుసార్లు అంబేద్కర్ ఎలా ప్రజలకు సేవ చేశారు అన్న అంశాలను ప్రజల నిరంతరం తెలియజేస్తూ అందరికీ అండగా ఉంటున్నామని తెలిపారు. ఇకనైనా అసత్యపు ఆరోపణలు మానుకొని అంబేద్కర్ భవన్ అభివృద్ధికి సహకరించాలని లేనిపక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ భవన్ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, సభ్యులు ఇంద్రముని,గోపి,పుష్ప రాజ్ పాల్గొన్నారు.