శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ..
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
స్వామివారి ఉత్సవ మూర్తులకు భక్తులు భవానంద రెడ్డి – జ్యోతి దంపతులు బంగారు కవచాలను విరాళంగా ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి వెంకట రమణా రెడ్డి కి అందచేశారు.
స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందజేసిన దాతలను ఆలయ కమిటీ వారు అభినందించారు. స్వామివారి సేవలో భక్తులు భాగస్వాములు కావడం సంతోషకరమని,దాతల కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.
