ఝరాసంగం గ్రామంలో 8వ దశ ఎఫ్ఎమ్డి టీకా కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామంలో 8వ దశ “ఎఫ్ఎండి” (పాదం మరియు నోటి వ్యాధి) టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్, మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, గ్రామ నాయకులు రాజేందర్ సింగ్, జగదీష్ పటేల్ పాల్గొని ప్రోత్సహించారు.వారి సమక్షంలో, గ్రామంలోని పశువులకు టీకాలు వేయించారు మరియు పశువుల యజమానులకు ఎఫ్ఎమ్డి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి వాస్. శివ కుమార్. కృష్ణుడు. రాములు. సులోచనా రాణి. సిబ్బంది. పాల్గొని విజయవంతంగా అమలు చేశారు.
