మద్దులపల్లిలో 8వ విడత గాలికుంటు టీకాలు…

మద్దులపల్లిలో 8వ విడత గాలికుంటు టీకాలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం భాగంగా 8వ విడత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం డాక్టర్ రాజబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్పుల సరిత పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు, ఫర్టిలిటీ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో పశువుల చికిత్స సౌకర్యాలు, కృత్రిమ గర్భధారణ సేవలు, పచ్చి గడ్డి విత్తనాల అందుబాటు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మొత్తం 116 పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుపతి, లక్ష్మణ్, సంతోష్, ముదాస్సిర్, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, రైతులు సమ్మయ్య, బానేష్, ఓదేలు పాల్గొన్నారు.

ఝరాసంగం గ్రామంలో 8వ దశ ఎఫ్‌ఎమ్‌డి టీకా కార్యక్రమం…

ఝరాసంగం గ్రామంలో 8వ దశ ఎఫ్‌ఎమ్‌డి టీకా కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామంలో 8వ దశ “ఎఫ్ఎండి” (పాదం మరియు నోటి వ్యాధి) టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్, మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, గ్రామ నాయకులు రాజేందర్ సింగ్, జగదీష్ పటేల్ పాల్గొని ప్రోత్సహించారు.వారి సమక్షంలో, గ్రామంలోని పశువులకు టీకాలు వేయించారు మరియు పశువుల యజమానులకు ఎఫ్‌ఎమ్‌డి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి వాస్. శివ కుమార్. కృష్ణుడు. రాములు. సులోచనా రాణి. సిబ్బంది. పాల్గొని విజయవంతంగా అమలు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version