ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎం. జె .ఎఫ్. మాదిగ జర్నలిస్టుల ఫోరం. మాదిగ జర్నలిస్టు అందరినీ ఏకం చేసి జాతి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎం. జె. ఎఫ్. మరిపెడ మండల అధ్యక్షులుగా చింత వెంకన్న ను నియమించడం జరిగింది,ఎం. జె. ఎఫ్. మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా మరిపెడ మండల అధ్యక్షులుగా చింత వెంకన్న కు నియామక పత్రం మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు శాగంటి రమేష్ మాదిగ. ఎం. ఎస్ .పి. జిల్లా అధ్యక్షులు పోలేపాక ఎల్లయ్య మాదిగ. సీనియర్ జర్నలిస్ట్ జిన్నా లచ్చయ్య. వంకాయలపాటి తిరుమలరావు. చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎం. జె. ఎఫ్. మరిపెడ మండల అధ్యక్షులుగా చింత వెంకన్న ను నియమించడం జరిగింది. మాదిగల ఆంక్షలు మేరకు మాదిగ జాతి ఉద్యమంలో నా వంతు పాత్ర కల్మషం లేకుండా నిర్వహిస్తానని నాపై నమ్మకంతో నాకు అప్పజెప్పిన బాధ్యతను మరింత బలాన్నిచ్చిందని ఈ నా ఎన్నిక కు సహకరించిన ఎం. ఎస్. పి .జాతీయ నాయకులు మంద కుమార్ మాదిగ .గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ .ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్ల అనిల్ మాదిగ .ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు శాగంటి రమేష్ మాదిగ. ఎం .ఎస్. పి .జిల్లా అధ్యక్షులు పోలేపాక ఎల్లయ్య మాదిగ. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగు రవి మాదిగ. మరిపెడ మండలం ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు జినక స్వామి మాదిగ, కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మరిపెడ మండల ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు తప్పెట్ల సురేష్ . మరిపెడ మండల జర్నలిస్ట్ లు భాష్పాంగు సోమన్న మాదిగ, భాష్పాంగు ,వెంకన్న మాదిగ, తప్పెట్ల ఉపేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు
నడికూడ,నేటిధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలను తనిఖీ చేసే సందర్భంలో విద్యార్థులు రాగి జావ తాగుతుండగా రాగిజావ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని,విద్యార్థులతో రాగి జావా తాగారు. వంట రూమును పరిశీలించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం పిల్లల ఫోటోతో కూడిన క్యాలెండర్ ను శాసనసభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా చర్లపల్లి పాఠశాల ఉందని,ఇక్కడి పరిసరాలు,వసతులు,చాలా బాగున్నాయని విద్యార్థులు చాలా చక్కగా ఉన్నారని, విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ను చూసి ఎమ్మెల్యే బాగుందన్నారు.పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన గ్రామ సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి ని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ను ఈ సందర్భంగా అభినందించారు.అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రధానోపా ధ్యాయులను అడిగి తెలుసుకుని 80 మంది విద్యార్థులకు గాను ఈరోజు హాజరైన విద్యార్థులు సంఖ్య 77 అని తెలుసుకుని విద్యార్థుల హాజరుపట్ల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
నర్సంపేట పట్టంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నూతన సంహాత్సరం 2025-26 క్యాలెండర్ ను మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ సంఘం కృషి చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్ధిక, రాజకీయంగా గౌడులు ఎదిగేందుకు పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో గౌడ కులస్తులు పోటీ చేసి తమ సత్తా చాటాలని రమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సొల్టీ సారయ్య గౌడ్,మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లా ల అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, తోటకూరి రాందాస్ గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్,రాష్ట్ర నాయకులు రామగోని సుధాకర్ గౌడ్ శీలం వీరన్న గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, మచ్చిక రాజు గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బోడిగే మల్లేశం గౌడ్, కొండి రాము గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, జేఏసీ నాయకులు వేముల రవి గౌడ్, వల్గుల రవీందర్ గౌడ్, జిల్లా కోశాధికారి మర్ద గణేష్ గౌడ్, యూత్ అధ్యక్షులు మర్ద సతీష్ గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి వెంకట్ గౌడ్, చెన్నారావుపేట, దుగ్గొండి అధ్యక్షులు గోడిశాల మల్లయ్య గౌడ్, తడుక కొమురయ్య గౌడ్, ముంజాల సంజీవ్ గౌడ్కు, కక్కేర్ల అశోక్ గౌడ్ ,సోషల్ మీడియా మండలం అధ్యక్షులు తాళ్లపెళ్లి రాము గౌడ్, సొల్టీ సాంబయ్య గౌడ్,గుండెబోయిన శివకోటి గౌడ్, నాగరాజు గౌడ్, గోడిశాల గిరినాద్ గౌడ్, ఊడ్గుల సునిల్ గౌడ్, రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సరస్వతి మాత విగ్రహావిష్కరణ జరిగింది. వాసవి క్లబ్ హనుమకొండ మరియు వాసవి క్లబ్ వనిత హనుమకొండ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కే సి జి ఎఫ్ జిల్లా గవర్నర్ గంప సాంబమూర్తి సరస్వతి మాత విగ్రహవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మెంబర్స్ విడియాల నూతన్ కుమార్,పబ్బతి నాగభూషణం,పాలడుగుల లక్ష్మణ్ కాంత్,అయిత వెంకటేశ్వర్లు,ఇరుకుల్ల శ్రీనివాస్,మాదం శెట్టి సంపత్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
నిరుపేదలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు వెంటనే ఇవ్వాలని బిఆర్ఎస్ మండల కమిటీ డిమాండ్ చేసింది.మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం రాజపల్లి గ్రామంలో నిర్వహించారు.ఈ మేరకు నర్సంపేట రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేదకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం పూర్తి అయ్యిన కూడా 12 వేలు ఇవ్వకుండా నిరుపేదలను మోసం చేసిందన్నారు.ఈ నెల 28 నుండి మొదటి విడిత 6 వేలు ఇస్తాం.రెండో విడతలో మరో 6 వేలు ఇస్తాం అని ఉప ముఖ్యమంత్రి చెప్పారన్నారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. పేర్కొన్నారు.మరల ప్రభుత్వం మాటమార్చి ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని పూర్తి చేసిన వారికే ఈపధకం ఇస్తామని మాట మార్చుతుందని విమర్శించారు.ప్రభుత్వం వెంటనే గ్రామ సభల ద్వార నిరుపేదలను ఎంపిక చేసి ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ఇవ్వాలని డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,మోతే జై పాల్ రెడ్డి, కొమల్ల గోపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మంచిక నర్సయ్య,మోటురి రవి,కోడారి రవి,భూక్యా వీరన్న,కడారి కుమారస్వామి,జర్పుల వీరన్న,కందుల రాజీ రెడ్డి తదితరులు ఉన్నారు
మండల ప్రజలకు ముందస్తు నూతన సం వత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి అని కరకగూడెం ఎస్సై రాజేందర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, 31 రాత్రి గుంపులు గుంపులుగా తిరగరాదని అన్నారు. ఎటువంటి ఎంట ర్టెన్మెంట్ కార్యక్రమాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కేక్ కట్ చేయాలి అనుకునే వారు తమ తమ ఇళ్ళలోనే చేసు కోవాలని సూచించారు. నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలను తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వ హించుకోవాలని ఎస్సై రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతంకల్పించకుండా నూతన సంవత్సరానికి స్వాగత వేడుకలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని హితవు పలికారు. సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శుతి మించకుండా పోలీసుల సూచనలు తప్పకుండా పాటించ వలసింది గా సూచించారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు అసౌకర్యం ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. ఎవరైనా శృతిమించి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే, వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్లు మోటార్ సైకిల్ (ద్విచక్ర వాహనాలు) నడుపుతూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్ యజమానిపై, తల్లిదండ్రులు పై చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.
భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేకును కట్ చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 2025కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను జనవరి 25వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సిపిఐ పార్టీ పార్టీ ఆవిర్భా వేడుకలను జయప్రదం చేయాలని ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు క్యాతరాజు సతీష్,గోనెల తిరుపతి, పీక రవి, యాకుబ్ పాషా, కాంతారావు,రాజేష్,కృష్ణ, పొనగంటి లావణ్య, రజిత శ్రీలత సంధ్య వాసం రజిత తదితరులు పాల్గొన్నారు.
రేగొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ రేగొండ బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పుట్టినరోజును వారి స్వగృహంలో గ్రామ కమిటీ బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి మే తుకు పెళ్లి బుచ్చిరెడ్డి గన్ రెడ్డి లింగారెడ్డి రేగొండ మండల ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు బండారి రవీందర్ మేకల రవీందర్ బూత్ అధ్యక్షులు అంబటి రాజకుమారు వాకిటి ముత్యము పున్నం రఘు వాకిటి ముత్యము ఎర్రబాటి శివకృష్ణ నేరెళ్ల శంకర్ గాడే తిరుపతి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు
జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి జన్మదిన వేడుకలు బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, ఉర్కొండ, నవాబుపేట మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచారు. రాజాపూర్ మండల కేంద్రంలో మహిళల కోలాటాలు, యువకుల డప్పు నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. బాలానగర్ మండల మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు వాలీబాల్ నెట్ ప్రాక్టీస్ పరికరాలను అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు
పరకాల నేటిధాత్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,ఎన్ఎస్యుఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డు గ్రహీత 2018,డాక్టర్. మడికొండ శ్రీను,సంపత్ ల ఆధ్వర్యంలో 2025నూతన సంవత్సరం క్యాలెండరును ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల పట్టణ,మండలం, నియోజకవర్గం మరియు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజానీకానికి నూతన సంవత్సర-2025 మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినారు.ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎంపీపీ ఒంటెరు రామూర్తి,పరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివ,బొచ్చు భాస్కర్,బొచ్చు రవి,బొచ్చు జితేందర్,కందుకూరి విద్యాసాగర్,మంద సురేష్,ఆర్ఎంపీ దుప్పటి బాబురావు,ఒంటెరు వరుణ్, బొచ్చు సంపత్,మద్దెల భద్రయ్య,ఒంటెరు సాగర్, మడికొండ ప్రవీణ్,మడికొండ నవీన్,మంద ఆనంద్, మరుపట్ల మహేష్, ఒంటెరు మొగిలి,రవి,బ్యాంకు సుధాకర్,బొచ్చు విష్ణు,బొచ్చు కిషన్,మడికొండ రాజు,బొచ్చు నాగరాజు,ఒంటెరు కిషోర్, నాగేల్లి ముత్తయ్య,సంగి పున్నం,ఒంటెరు సమ్మయ్య, మహిళలు నాగేల్లి సరోజన, మడికొండ ఓదెమ్మ, ఒంటెరు రజిత,ఒంటెరు మరియమ్మ, చుక్క భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా విజయలక్ష్మీ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తమ నివాసంలో భర్త రవిచంద్ర, కుమారులు నిఖిల్ చంద్ర-అనీల,నాగరాజు వద్దిరాజు-అర్చిత,కూతురు డాక్టర్ గంగుల గంగాభవానిలతో కలిసి కేక్ కట్ చేశారు.మనవళ్లు, మనుమరాలుతో కలిసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆమెకు కుమారుడు ప్రీతమ్, మరిది-చెల్లెలు వద్దిరాజు వెంకటేశ్వర్లు- పద్మావతి,ఎంపీ రవిచంద్ర సన్నిహితులు వీ.ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి,సురేష్ తదితరులు పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
`కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశాన్నే అపహాస్యం చేసి,
`అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు తెగబడి
`ఇప్పటికీ ఆటలాడుతున్న బిల్లుల మాయగాడు.
`రవాణా దోపిడిలో అంతుచిక్కని సంపాదనలో ఆరితేరినాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
అతను ఓ గుమస్తా! జస్ట్ సివిల్ సప్లయ్ శాఖలో గుమస్తా!! ఇప్పుడు అరాచకానికి వ్యవస్ద. అక్రమాలకు వ్యవస్ధ. తోటి వ్యాపారులకు మింగిస్తున్న వ్యవస్ధ. తాను తప్ప మరొకరు మిల్లుల వ్యాపారంలో వుండకుండా చేయాలని చూస్తున్న వ్యవస్ధ. తాను తిమింగలమై, ఇతర మిల్లుల ఉనికి లేకుండా చేసేందుకు తెగబడుతున్న అవస్ధ. వ్యవస్ధకే అవస్ధలు తెచ్చిపెడుతున్న దురవస్ధ. ఇది తోటి మిల్లలు పడుతున్న ఆవేదనకు నిదర్శనం. ఆందోళనకు సంకేతం. వారు అనుభవిస్తున్న గోసకు నిర్వచనం. ఒక వ్యక్తి తాను తప్ప మరొకరు వుండకూడదన్న అహం ముందు పాపం ఇతరులు నష్టపోతున్నారు. ఏ సివిల్ సప్లయ్ శాఖలో గుమస్తా గిరి వెలబెట్టాడో అదే శాఖను హన్మకొండ జిల్లాలో గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నాడు. అందుకు కారణం ఒక్కటే..అతనేదో గొప్ప వ్యాపారనిష్టాడై కాదు. కేవలం కులం. ఒక వ్యక్తి ఆధిపత్యానికి కులం ఎలా తోడౌతుందో, బలమౌతుందో ఈ వ్యక్తి అరాచకం చూస్తేనే అర్ధమౌతుంది. ఒకప్పుడు అందరికీ వంగి వంగి దండాలు పెట్టి కొలువు చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు అందరిచేత శనార్ధులు పెట్టించుకునే స్ధాయికి చేరుకున్నాడు. కారణం కులం. అంతే జస్ట్ కులం. అంతే కాదు ఇప్పుడు ఈ సివిల్ సప్లయ్ శాఖనే శాసిస్తున్నాడు. అలా ఫోజు కొడుతున్నాడు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ముందు ఇతర కులాలకు చెందిన వ్యాపారులు వుండొద్దు. వారి మనుగడ కనిపించొద్దు. అతను వెలుగబెడుతున్న వ్యాపారంలో ఇతర కులాలకు చెందిన వాళ్లు వుండొద్దు. ఎదగొద్దు. కాకపోతే తన అనుచురులు, బినామీలకు మాత్రం వెసులుబాటు కల్పించినట్లున్నాడు. ఎందుకంటే వాళ్లు ఈ వ్యక్తి చెప్పు చేతుల్లో వుంటారు. అణిగి మణిగి వుంటారు. ఇతరులు మాత్రం అతని దృష్టిలో చీమలు, దొమలు, పురుగులు..మొత్తంగా అంటరాని వారు. ఇంతటి దుర్మార్గం కొనసాగుతున్నా పట్టించుకున్నవారు లేరు. ఎదురించిన వారు లేరు. తమ గోడు అధికారులకు చెప్పుకున్నా, మళ్లీ అతని చెవికి చేరుతుందని భయపడుతున్నారంటే ఎంతగా తన ఆధిపత్యం పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కులం పేరుతో విర్రవీగేవారు వున్నారా? అంటే మిల్లర్ల సమాజం మొత్తం అతన్ని వెలెత్తి చూపిస్తుందంటే ఎంతగా వారిలో ఆందోళన, ఆవేదన వుందో అర్ధం చేసుకోవచ్చు. కులం పేరుతో అహం నింపుకున్న ఆ వ్యక్తి ఇతర కులాలు మిల్లింగ్ వ్యవస్ధలో వుండడానికి ఇష్టపడడం లేదు. కొన్ని దశాబ్దాలుగా మిల్లుల వ్యాపారాలు సాగిస్తున్న కుటుంబాలను కూడా ఈ వ్యక్తి బెరిరిస్తున్నాడు. అదిరిస్తున్నాడు. వారిపై వ్యాపారాలను దెబ్బతీస్తున్నాడు. వారికి ప్రభుత్వం నుంచి వడ్లు అందకుండా చేస్తున్నాడు. హన్మకొండ జిల్లాలో తన బినామీ మిల్లులకే మొత్తం వడ్లు సమకూర్చుకుంటున్నారు. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడుతున్నాడు. ఇతర మిల్లర్లను నిండాముంచేస్తున్నాడు. వారి మిల్లులు నడవకుండా చేస్తున్నాడు. వారికి వడ్లు రాకుండా అదికారుల మీద ఒత్తిడి తెస్తున్నాడు. బకాయి దారులకు వడ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం చెప్పిన ఒకే ఒక్క మాటతో ఇతర మిల్లర్ల మీద కక్ష కట్టి తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. నిజానికి ఈ వ్యక్తి కక్షకట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఆ మిల్లర్లు కేవలం ఒకే సీజన్‌కు మాత్రమే బకాయిలున్నారు. అలా ఒక సీజన్ బకాయిదారులకు రాష్ట్రంలో అంతటా వడ్లు ఇస్తున్నారు. కాని ఇతర మిల్లర్ల మీద బకాయిదారులను లేనిపోనివి అధికారులకు చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చి, తన ఇలాఖాలో తన బినామీ మిల్లులు తప్ప, ఇతర మిల్లులు లేకుండా చేస్తున్నాడు. సివిల్ సప్లయ్ శాఖలో గుమస్తాగా పనిచేసిన వ్యక్తికి శాఖలో లొసుగులు తెలుసు. అధికారుల అండదండలు పుష్కలంగా వున్నాయి. గుమస్తా కొలువు నుంచి తప్పుకున్న తర్వాత నేరుగా ఈ వ్యక్తి మిల్లుల వ్యాపారంలోకి దిగినా అతని పేరు మీద లేవు. కొంత మంది అనుచరుల పేరుతో మిల్లులు ఏర్పాటు చేసుకున్నాడు. పై నుంచి చక్రం తిప్పుతూ వాటిని నడిపిస్తున్నాడు. ఇటు మిల్లులే కాదు, దానికి సంబంధించిన మరో వ్యాపారాన్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాడు. అక్కడ కూడా కోట్లు దండుకుంటున్నాడు. ఈ విషయం మరో ఎపిసోడ్‌లో చెప్పుకుందాం…ఇప్పుడు చిన్నా చితక మిల్లర్లు పడుతున్న ఇబ్బందులు, ఈ వ్యక్తి మూలంగా ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకుందాం. చిక్కడు, దొరకడు లాంటి క్యారెక్టర్ ఈ గుమస్తాది. కొలువు నుంచి రిటైర్ అయిన తర్వాత తెలంగాణలో వారి కులం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఈ గుమస్తా ఎవరో తెలియదు. కాని తెలంగాణ గత ప్రభుత్వంలో ఆ కులమే కీలకం. ఆ కులానికి చెందని నాయకులదే ఆధిపత్యం. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. దాన్ని ఆసరా చేసుకొని తాను కూడా కులం బోర్డు తగిలించుకున్నాడు. జిల్లాలోని ఓ పెద్ద నాయకుడికి పేరు చెప్పుకుంటూ వెలుగుతూ వచ్చాడు. ఇప్పటికీ ఆ వెలుగులోనే వుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలలోనే పేరున్న ఆ నాయకుడి కులం, ఈ గుమస్తా కులం ఒకటే కావడంతో తనకు కాలం కలిసి వచ్చింది.. ఆ నాయకుడికి ఎంత దగ్గరో ఎవరికీ తెలియదు. ఆ నాయకుడికి కులం, ఈ వ్యక్తి కులం ఒక్కటే కావడమే తన వ్యాపారానికి అడ్డూ అడుపూ లేకుండాపోయింది. అదే సమయంలో కులాన్ని అడ్డు పెట్టుకొని ఎదగాలనుకున్నాడు. ఆ పెద్ద నాయకుడితో పలుసార్లు కనిపించడం మొదలు పెట్టాడు. మిల్లులు ఏర్పాటు చేసి, వ్యాపారం మొదలు పెట్టాడు. పదేళ్లు తన ఆదిపత్యం కొనసాగిస్తున్నాడు. హన్మకొండలో వున్న ఇతర మిల్లుల మీద పగబట్టాడు. ఆ మిల్లులను ఆగం చేస్తున్నాడు. ఒక మిల్లు నడకుండా వుంటే ఎంత నష్టమో ఈ గుమస్తాకు తెలుసు. అలా మిల్లులు నడవకుండా చేసి, దివాళా తీసేలా చేస్తే తన మిల్లులకు అడ్డుం వుండదని స్కెచ్ వేసుకున్నాడు. ఇతర మిల్లులను ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఆ మిల్లులను బాకాయి మిల్లులుగా ముద్ర వేసి, వారికి వడ్లు రాకుండా చేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య మిల్లర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ షరతులను జాయింట్ కలెక్టర్ వివరిస్తుంటే మీటింగ్ నుంచి లేచి వెళ్లిపోవడమే కాకుండా తొక్కలో షరతులు అంటూ వెళ్లిపోయేంత అహం నింపుకున్నాడు. తాను బకాయిలు లేకుండా చూసుకొని, ఇతరుల బకాయిలను తెరమీదకు తెచ్చిన తాను సద్దుపూసనన్నట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లు, రైతులను తాను ఎలా మోసం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియదనుకుంటున్నాడు? ప్రభుత్వాన్ని ఎలా మాయ చేస్తున్నాడో ఇతరులు కనిపెట్టలేకపోతున్నారన్న భ్రమల్లో వున్నాడు. కోట్ల రూపాయలు చెక్కులు ఎలా తయారు చేయించుకుంటున్నాడో నేటిధాత్రి వద్దపూర్తి సమాచారం వుంది. ఈ కోట్ల రూపాయల చెక్కు రెడీ అయ్యింది. అందులో వాటాలు పంచుకునేందుకు అదికారులు కూడా రెడీగా వున్నారు. తన కులం వాళ్లు కాకుండా ఇతర కులాలకు చెందిన మిల్లుల మనుగడ లేకుండా ఓ వైపు కుట్రలు చేస్తున్నాడు. ప్రభుత్వం కళ్లుగప్పి మరో రకంగా కోట్లు ఆర్జిస్తున్నాడు. అటు వడ్లు తన బినామీ మిల్లులకు మాత్రమే అందేలా తన కులం పలుకుబడి ఇంత కాలం చూపించుకుంటూ వస్తున్నాడు. ఆ ముసుగులో ఎవరికీ కనిపించని మరో చీకటి వ్యాపారం సాగిస్తున్నాడు. అందులో రైతులను నిండా ఎలా ముంచుతున్నాడన్నది మరో కథనంలో పూర్తి వివరాలు అందిస్తాం…
`కంప్లీషన్ సర్టిఫికెట్ జారీలో అధికార్లకు మరింత జవాబుదారీతనం తప్పదు
`కంప్లీషన్ సర్టిఫికెట్ వుంటేనే బ్యాంకుల రుణాలు
`విద్యుత్, తాగునీరు, మురుగునీటి సౌకర్యాలు కూడా ఈ సర్టిఫికెట్ ఆధారంగానే
`నిర్మాణ ప్రదేశంలో బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శన తప్పనిసరి
`కొనుగోలుదారులూ జాగ్రత్తపడకపోతే నష్టపోక తప్పదు
`అనవసర సానుభూతికి అడ్డుకట్ట
హైదరాబాద్,నేటిధాత్రి:
భవనాల క్రమబద్ధీకరణ విషయంలో జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పు భవన నిర్మాణరంగంలో మరింత పారదర్శకతను ప్రోత్సహించేదిగా మాత్రమే కాదు, అవినీతి, నిర్లక్ష్యం, బద్ధంకంతో కూడిన అధికార్లకు ముల్లుపోటు వంటిదనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. అవినీతి, లంచగొండితనాలకు బాగా అలవాటు పడిన కొందరు అధికార్లకు ఈ తీర్పు గొంతులో పచ్చివెలక్కాల పడిన చందం వంటిదే. ఎందుకంటే బిల్డర్లతో కుమ్మక్కయి నిబంధనలకు వ్యతిరేకంగా ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తూ ఇటు ప్రజలకు,పర్యావరణానికి ఇబ్బందులు కలిగించే విధంగా, ఇదే సమయంలో భూమిపై పెరుగుతున్న ఒత్తి డిని గుర్తించకుండా లంచాలు మరిగి బిల్డర్లకు కొమ్ముకాస్తున్న అధికార్లు ఈ తీర్పుతో ఇక ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఎప్పుడైతే ఇటువంటి అధికార్లు దోవకు వస్తారో అప్పుడు బిల్డర్లు కూడా ఒళ్లు దగ్గరపెట్టుకొని తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించక తప్పదు. చాలా సందర్భాల్లో భూమిని చూపించి ప్రకటనలద్వారా అపార్ట్‌మెంట్లు, విల్లాల బుకింగ్‌లు చేపట్టిన కొన్ని కంపెనీలు, తగిన మొత్తంలో ప్రజలనుండి అడ్వాన్స్ మొత్తాలను సేకరించి తర్వాత బోర్డు తిప్పేయడం వంటి అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అటువంటి మోసగాళ్లనుంచి అమాయకులైన ప్రజలకు కొంతమేర రక్షణ కల్పిస్తుదని చెప్పవచ్చు. ఇదే సమయంలో కొత్త అపార్ట్‌మెంట్లు, విల్లాలు లేదా భవనాలు కొనుగోలు చేయాలనుకునేవారు గుడ్డిగా వేటినీ నమ్మకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మరీ తమ కష్టార్జితా న్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ తీర్పు మార్గదర్శనం చేస్తుంది. అంతేకాదు దిగువ కోర్టు లు వివిధ కారణాలను చూపుతూ బిల్లర్లపై ‘సానుభూతి’ చూపాల్సిన అవసరం లేదని కూడా ది గువ కోర్టులను కోరింది. ఊరికే రాని డబ్బును, అయాచితంగా జరుగుతున్న మోసాలు అప్పనంగా కబళించి వేస్తుంటే, గుడ్డిగా నమ్మిన సామాన్యులు మోసపోవడం, దండిగా సంపాదించుకున్న మోసగాళ్లు బిచాణా ఎత్తేయడం చాలా సందర్భాల్లో చోటుచేసుకుంటున్నది. అటువంటివి జరగకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అధికార్లు మొద్దునిద్ర వదిలి, చురుగ్గా పనిచేసేలా చేస్తున్నది. ఇకముందు అధికార్లు అను మతులు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, భవన నిర్మాణ దశలపై రికార్డుల్లో నమోదు చేయాలి. తప్పుడు అనుమతులు ఇస్తే వీళ్లే జరిమానాలు చెల్లించాలి! పట్టణ ప్రణాళిక అనేది అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు. పర్యావరణం, జనాభా, భూమిపై ఒత్తిడి, భూగర్భ జలాలు, వంటి వివిధ అంశాల ప్రాతిపదికన పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం వెల్లివిరిసేలా ప్రణాలిక రూపకల్పన జరుగుతుంది. అక్ర మంగా భూములను ఆక్రమించుకొని లేదా పట్టణ ప్రణాళికతో సంబంధంలేకుండా తమకు అనుకూలమైన రీతిలో భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతుండటం వల్లనే రాష్ట్రంలోని నగరా లు, పట్టణాలు ఒక పద్ధతి లేకుండా విస్తరిస్తున్నాయి. ఫలితంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు నిండా మునిగిపోవడం, నడి ఎండాకాలంలో నీటి ఎద్దడి వంటి సమస్యలు సర్వసాధారణమైపోయా యి. అదే పట్టణ ప్రణాళిక ప్రకారం, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇళ్లు, భారీ నిర్మాణాలు చేపడితే పై సమస్యలకు తావుండదు. ముఖ్యంగా విద్యుత్, భూగ ర్భజలాలు, రోడ్లపై ఒత్తిడి పెరగదు. కానీ అవినీతి తాండవమాడేది సరిగ్గా ఈ నిర్మాణ అనుమ తుల విషయంలోనే. బిల్డర్ల అత్యాస, అవినీతి అధికార్ల కక్కుర్తి వెరసి పట్టణాలు, నగరాలు ఇరు కుగా మారుతున్నాయి. అదీకాకుండా ఎవరైనా అక్రమ నిర్మాణమంటూ కోర్టుకెళితే, అన్ని రకాల అనుమతి పత్రాలను చూపి బిల్డర్లు యదేచ్ఛగా తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో అనుమతులు ఇచ్చే ముందు అధికార్లు వెనకా ముందూ ఆలోచిం చి అన్నీ సక్రమంగా వుంటేనే ముందుకెళ్లాలి. లేకపోతే వీరికి జరిమానా తప్పదు. నిర్మాణ సమయంలో భవనాన్ని నిర్ణీత కాలావధిలో తనిఖీలను ఈ తీర్పు తప్పనిసరి చేసింది. అధికార్లు ఏమా త్రం బద్ధకించినా లేదా నిర్లక్ష్యం వహించినా, జరిగే పొరపాట్లకు వారే బాధ్యత వహించక తప్పదు. కోర్టు ధిక్కరణను కూడా ఎదుర్కొనాల్సి వుంటుంది. ఇక బిల్డర్ల విషయానికి వస్తే ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్ నిర్మాణ ప్రదేశంలో ప్రదర్శించడంతప్పనిసరి. దీనివల్ల అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ లేనిదీ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు అనుమతించిన ప్లాన్ ఒకటైతే, నిర్మాణం మరో ప్లాన్‌లో చేపట్టడం అన వాయితీగా వస్తోంది. ఇందుకు కారణం లంచాలే! లంచం సమర్పిస్తే ఏ అధికారి తనిఖీలకు రా రు. బిల్డర్లదే ఇష్టారాజ్యం. కేవలం కాగితాలపై మాత్రమే ప్రణాళిక ప్రకారం నిర్మాణం వుంటుంది. ప్రదేశం మీద నిర్మించే దానికి, అనుమతించిన ప్లాన్‌కు అసలు పొంతనే వుండదు. ఇటువంటి అక్రమాలకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసేదిగా వుంది. అంతేకాదు బిల్డింగ్ ప్లాన్‌కు ఆమోదం పొందే సమయంలో బిల్డర్ ‘సంబంధిత అధికార్లనుంచి కంప్లీషన్/ఆక్యుపేషన్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వా తనే యజమానులకు బిల్డింగ్‌ను లేదా అపార్ట్‌మెంట్‌ను అప్పగిస్తానని ఒక హామీ పత్రం ఇవ్వడాన్ని’ ఈ తీర్పు తప్పనిసరి చేసింది. ముఖ్యంగా ఇది లబ్దిదారులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే అన్నిరకాల సదుపాయాలు కల్పించకుండా యజమానులకు బిల్డింగ్‌ను అప్పగించకుం డా ఈ హామీ పత్రం నియంత్రిస్తుంది. ఇదే సమయంలో బ్యాంకులు కూడా బిల్డర్ల మాయా జా లానికి మోసపోకుండా వుండేందుకు కూడా తీర్పులో కచ్చితమైన నిర్దేశాలుండటం విశేషం. కంప్లీషన్ సర్టిఫికెట్‌ను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బ్యాంకులు, బిల్డర్లకు రుణాలు మంజూరు చేయాల్సివుంటుంది. అంతేకాదు కంప్లీషన్/ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందితేనే నిర్మాణానికి విద్యుత్, మంచినీరు, మురుగునీటి కనెక్షన్ అందించాలని కూడా సంబంధిత అధికార్లకు కోర్టు నిర్దేశించింది. ఇన్ని లింక్‌లు వున్న నేపథ్యంలో అధికార్లు కంప్లీషన్ సర్టిఫికెట్ జారీచేసే సమయంలో కచ్చితంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో ఎదైనా సమస్య వస్తే ఇరుక్కునేది జారీచేసిన అధికారి మాత్రమే! ఎందుకంటే ఈ సర్టిఫికెట్‌పైనే ఆధారపడి మిగిలిన అన్ని సదుపాయాలు, రుణాల మంజూరు జరుగుతున్నాయి కనుక! వీటిల్లో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా అది కోర్టు ధి క్కరణకే వస్తుందని స్పష్టం చేయడం అవినీతికి ముకుతాడు వేసే చర్యనే! ఇదే సమయంలో ఒక బిల్డర్, కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదనో, అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధం చేయలేదనో లేదా మరే ఇతర కారణాలనో చూపుతూ ఫిర్యాదు చేసినప్పుడు, అధికార్లు దానిపై 90 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. అధికార్లు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే, అదికూడా ఏకకాల పరిష్కారంగా చేపట్టాలి. ఒకవేళ ఏదైనా భవనం నిర్ణీత ప్లాన్ ప్రకారం లేదని తేలినా, అక్రమంగా నిర్మిస్తున్నాడని నిర్ధారణ అయినా దాన్ని తక్షణం కూల్చి వేసే అధికారం అధికార్లకుంటుంది. అటువంటి నిర్మాణాల అంశం కోర్టుల దృష్టికి వస్తే వాటిని ఆపాలి. లేకపోతే కోర్టులు ‘అనవసర సానుభూతి’ చూపినట్లవుతుంది. ఈవిషయంలో కోర్టులు కచ్చితంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో నివాస భవనాలను వాణిజ్య భవనాలుగా మార్పిడి చేసిన కే సుపై సుప్రీంకోర్టు తాజాగా డిసెంబర్ 17న ఇచ్చిన ఈ తీర్పు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేదిగా వుంది. ఈ తీర్పు కాపీలను దేశంలోని అన్ని హైకోర్టులకు పంపడం వల్ల అక్రమ నిర్మాణాల విషయంలో ఆయా కోర్టులు ఈ నిర్దేశాలను కచ్చితంగా పాటించేందుకు వీలవుతుంది.
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు “కరుణాకర్”
జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణ బాధ్యులుగా పార్వతి రాజేష్ పేరు ప్రకటన
“నేటిధాత్రి”మంచిర్యాల, డిసెంబర్, 30
సమాజ పద నిర్దేశకులైన జర్నలిస్టులకు నాయకత్వం వహించే సంఘాల నేతలు నిబద్ధతతో వారికి మార్గ నిర్దేశం చేయాల్సింది పోయి తమ స్వప్రయోజనాలకు వారిని పావులుగా వాడుకోవడం అత్యంత విచారకరమని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీనియర్ పాత్రికేయుడు పార్వతి రాజేష్ అధ్యక్షతన జరిగిన డబ్ల్యూజేఐ సన్నాహక సమావేశానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయన్నారు. రాష్ట్రంలోని 80 శాతం మంది జర్నలిస్టులకు వేతన వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. సర్కులేషన్, ప్రకటనల సేకరణ కర్తలుగా జర్నలిస్టులు మారిపోవడం దురదృష్టకర పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల స్థితిగతుల్లో మార్పు తేవాల్సిన, ఈ దుస్థితి నుండి వారిని బయటపడేయాల్సిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంలో ఇప్పటివరకు ఈ రంగంలో పని చేస్తున్న ట్రేడ్ యూనియన్ల వైఫల్యం గ్రామీణ జర్నలిస్టులకు శాపంగా మారిందని కూడా వారు చెప్పారు. ఆయా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టుల జీతభత్యాలు, ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతల నుండి యాజమాన్యాలు ఎప్పుడో వైదొలిగిపోగా, ఆ బాధ్యతను గుర్తు చేయాల్సిన జర్నలిస్టు సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాయని వారు మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో న్యాయ పరమైన హక్కుల కోసం జర్నలిస్టులకు మార్గం చూపించేందుకు దేశంలోనే అతిపెద్ద కార్మిక రంగ సంస్థ బీఎంఎస్ ఆధ్వర్యంలోని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని కరుణాకర్, ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు. వృత్తి పరమైన సవాళ్లను జర్నలిస్టులు ధీటుగా ఎదుర్కొనేందుకు, పనికి తగ్గ వేతనాలు దక్కించుకునేందుకు జర్నలిజం రంగంలోకి నూతనంగా వస్తున్న వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు డబ్ల్యూజేఐ అండగా ఉంటుందని వెల్లడించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్య భీమా, నివేషణ స్థలాల విషయంలో అర్హులందరికీ న్యాయం జరగాలన్నది తమ అభిమతం అని, దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. పాత్రికేయ రంగంలోకి నూతనంగా వస్తున్న వారికి శిక్షణ తరగతులు ఇప్పించడంలో మీడియా అకాడమీ వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. అవసరమైన పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవలే తాము రాష్ట్రస్థాయి సదస్సు హైదరాబాద్ లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రిడికేషన్లు, ఎంప్యానల్మేంట్, రేట్ కార్డ్ విషయంలో స్థానిక పత్రికలకు అన్యాయం జరిగితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన డబ్ల్యూజేఐ సన్నాహక సమావేశానికి 50 మందికి పైగా జర్నలిస్టులు హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా యూనియన్ నాయకులు దారం జగన్నాథరెడ్డి, పార్వతి రాజేష్ ,చొక్కారపు శ్రీనివాస్, దుస్స శివప్రసాద్ ,పరశురామ్ ,ముత్యం వెంకటేష్,ఓదెలు,రాజు,గట్టయ్య , అనిల్,వెంకటేష్,రాజేష్,గౌతం,తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణ బాధ్యులుగా పార్వతి రాజేష్ ను ప్రకటించారు.
పరకాల నేటిధాత్రి పరకాల పట్టణానికి చెందిన ప్రముఖ ఎరువుల దుకాణం అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వారి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను అరుణ ఫర్టిలైజర్ షాప్ యజమాని గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరకాల వ్యవసాయ అధికారిశ్రీనివాస్ చేతుల మీదుగ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో రైతులకు పంటలు బాగా పండి సుఖసంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవనం సాగించాలని తెలిపారు
వనపర్తి నెటిధాత్రి : వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులనుండి ఎస్పీ రావుల గిరిదర్ భాధితుల నుండి ఫిర్యాదులను స్వకరి oచారు బాధితుల సమస్యలు విచారణ చేపట్టి త్వర గా పరిష్కారించాలని పోలీస్ అధికారులను ఆదేశిం చారు
రామకృష్ణాపూర్ పట్టనంలోని మిషన్ భగీరథ కు సంబంధించిన పంపు వాల్ ప్రహరీ పైకప్పు వేయకపోవడంతో మూగ జీవాలు,పశువులు పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చాలా చోట్ల మిషన్ భగీరథ పంపు వాల్ ప్రహరీ నిర్మించి పై కప్పు వదిలేశారు కాంట్రాక్టర్లు. అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ఇష్టా రీతిలో బిల్లులు పొంది పనులను గాలికి వదిలేశారు. మున్సిపాలిటీ అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎన్ని మూగజీవాలు మిషన్ భగీరథ వాల్ పంపు సెట్ లో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతాయోనని పశువుల యాజమానులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలని పాడి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ పాల రాజయ్య కోరుతున్నారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యాన, సంక్షేమ, డిఆర్డీఏ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభరి అధికారి మాట్లాడుతూ నీతి ఆయోగ్ భూపాలపల్లి జిల్లాను యాస్పిరేషన్ జిల్లా గా ప్రకటించినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పారా మీటర్ల నమోదులో వ్యత్యాసం రాకుండా పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. పారా మీటర్ల నమోదు ప్రాముఖ్యతను వివరించారు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి డేటా ఖచ్చితత్వం అవసరమని, అందుకు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, వారి విభాగాలకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమాలు, సమస్యలపై ప్రస్తావించారు. అదేవిధంగా, నీతి ఆయోగ్ నుండి అందే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమీక్ష ద్వారా జిల్లాలో వివిధ రంగాల్లో అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలను గుర్తించి, వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులకు అవగహన కల్పించాలని సూచించారు. భూ సార పరీక్షలు నిర్వహించి భూమికి అనుగుణంగా పంటల సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల్లో క్రమం తప్పక బరువు చూస్తూ పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల్లో గర్భిణీలు ఆరోగ్య పరిరక్షణకు గ్రూప్ డిస్కస్ ను పెట్టాలని సూచించారు. గృహ సందర్శన ద్వారా నిరంతరం గర్భిణీల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక ఫోకస్ చేయాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు అందించాలని తెలిపారు. నూరు శాతం అన్ని గ్రామ పంచాయతీల్లో అంతర్జాల సేవలను అందుబాటులోకి తేవాలని సూచించారు. 5 కిమి పరిధిలో బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సిపిఓ బాబురావు, జిల్లా వైద్యాదికారి డా మధుసూదన్, డిఆర్డీఓ నరేష్, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి చిన్నయ్య, వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, పశు సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి నేటిధాత్రి : అనుస్ అకాడమీ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.న్యాయవాడి ఉత్తరయ్య డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్l సైబర్ క్రైమ్స్ మరియు బాల్య వివాహల గురించి వివరించారు .ఈ కార్యక్రమం లో అరుణరెడ్డి ప్రిన్సిపాల్ విద్యార్థుల పాల్గొన్నారు
ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు గ్రీవెన్సెల్ లో భూపాలపల్లి జిల్లా వివిధ మండలాల్లో పంచాయితీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.గ్రామాలలో సర్పంచి పదవీకాలం ముగియడంతో గ్రామ లలో అవసరమైన పారిశుధ్యం,లైటింగ్ ,త్రాగునీటి సమస్యల పై పంచాయితీ కార్యదర్శులు డబ్బులు ఖర్చు చేస్తున్నారు.గ్రామ పంచాయితీ ల నిధులు ప్రభుత్వం నుండి సకాలంలో విడుదల కాక పంచాయితీ కార్యదర్శులు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి గ్రామాలలో పనులు చేస్తున్నారు,చేసిన పనులకి స్పెషల్ ఆఫీసర్లు బిల్లుల పై సంతకాలు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు.దీని పై కలెక్టర్ వెంటనే స్పందించి గ్రామ పంచాయితీల కు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో ధర్మ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ కార్యక్రమం లో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్,జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్,జిల్లా ప్రధాకార్యదర్శి కండె రవి,భూపాలపల్లి మండల కన్వీనర్ గుండ్ల ఓంకార్,మండల నాయకులు బండారి దశరథ్,మోకిడి అశోక్ పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.