కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శించుకున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి

భీమదేవరపల్లి, నేటి ధాత్రి :

నీరుద్యోగ యువత గొంతుకనవుతా..

ముల్కనూరులో బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన యువత

ముల్కనూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నరేందర్ రెడ్డి.

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మీదకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగ యువత గొంతుకనవుతానని ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.. బుధవారం కొత్త కొండ వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న నరేందర్ రెడ్డిని పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీతో స్వాగతం పలికి సన్మానించారు.. ఈ సందర్భంగా ముల్కనూర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు..అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులు, ఉద్యోగుల సమ స్యల పరిష్కారం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అన్నారు.. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక,జాబ్ క్యాలెండర్లు విడుదల కాక, ఒకవేళ నోటిఫి కేషన్లు వచ్చినా, ఎగ్జామ్స్ పెట్టినా, ఉద్యోగ నియా మకాలు పూర్తికాక నిరుద్యోగులు, ఏండ్లు గడు స్తున్నా డీఏ, ఇంక్రిమెంట్స్ తదితర బకాయిలు రాక, సమస్యలు తీరక ఉద్యోగులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే తాను నిరుద్యోగులు, ఉద్యోగుల తరపున గళం వినిపించేందుకు కరీంనగర్. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించు కున్నట్టు తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా స్వ చ్ఛందంగా సేవ చేస్తానన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *