లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది
రాజీమార్గమే రాజామార్గం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్
జైపూర్, నేటి ధాత్రి:
రాజీమార్గం రాజమార్గమని, కక్షకారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షి దారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గ మని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.