నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని గుండ్ల పహాడ్ గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల యాదగిరి అనారోగ్యంతో మృతిచెందగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, క్లస్టర్ ఇన్చార్జీలు గందె శ్రీనివాస్, శివాజీ, గ్రామ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.