కంకణబద్ధులై కదలాలి కారు గుర్తును గెలిపించాలి

వేములవాడ నేటి దాత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై కదిలి కారు గుర్తును గెలిపించాలని కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వేములవాడ పట్టణంలోని 4వ వార్డ్ మహాలక్ష్మి వీధిలో బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు…

Read More

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిదాత్రి: శనివారం పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకురాళ్లు బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ చరిత్రలో అద్భుతమైన పండుగని, ఈ పండుగను కళాశాలలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రమేష్ చంద్ర…

Read More

కెజిఎఫ్ స్టార్ పై రవితేజ కామెంట్స్… నీపై గౌరవం పోయిందంటూ ఫ్యాన్స్ ఫైర్

రవితేజ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. యష్ ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ హీరో యష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. యాంకర్ ఒక్కో సౌత్ ఇండియా స్టార్ పేరు చెబుతూ వాళ్లపై రవితేజ అభిప్రాయం షార్ట్ గా చెప్పాలన్నారు. ముందు రాంచరణ్, ప్రభాస్,…

Read More

ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలోని రేగుళ్ల గ్రామంలో ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సిహెచ్ కుమార్ స్వామి, శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు 65 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ పాల్గొన్నారు

Read More

మైనారిటీ సోదరుల ఆత్మీయ సమ్మేళనం

  వేములవాడ నేటి ధాత్రి ముస్లింల సంక్షేమం కొరకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది నియోజకవర్గంలోని ముస్లింలందరూ ఏకమై ఒక్క సారి అవకాశం ఇస్తే, సమస్యలన్నీ పరిష్కరిస్తా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముస్లిం మైనార్టీలు అంటే ఎనలేని ప్రేమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శనివారం…

Read More

శాంతియుతంగా చేస్తున్న నిరసనను భగ్నం చేయడం పోలీసులది సిగ్గుమాలిన చర్య

# బిఎస్పి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్ నర్సంపేట, నేటిధాత్రి: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక యాదవ్ యువతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివిధ ఉద్యోగ నియామక ప్రవేశ పరీక్షలు వాయిదా పడడం వల్ల మానసికశోభానికి శుక్రవారం హైదరాబాదులో గురై ఆత్మహత్య చేసుకున్నది. ప్రవళిక మరణానికి కేసీఆర్ ప్రభుత్వం, టిఎస్పిఎస్సి బోర్డు బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ తో కేయూ జేఏసీ విద్యార్థి…

Read More

ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యనే .

ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ డిమాండ్. మహా ముత్తారం నేటి ధాత్రి. మహాముత్తారం లో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ లో నిరుద్యోగ విద్యార్థినీ ప్రవళిక మృతి, చాలా బాధాకరం, నిరుద్యోగల జీవితలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, టి ఎస్ పి ఎస్ సి బోర్డు. టి ఎస్ పి ఎస్ సి వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల…

Read More

అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం… ఆశీర్వదించండి

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగించుకుందామని. అందుకు అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,…

Read More

బుద్దుడి జీవితాన్ని నేటి యువత అద్యాయనం చేయాలి.

చిట్యాల, నేటి దాత్రి : శనివారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏ వై ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రపు రాజేందర్ అద్యక్షతన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ద మతం* స్వీకరించిన రోజును పురస్కరించుకోని గౌతమా బుద్దుడి చిత్ర పటానికి, అంబేద్కర విగ్రహానికి పూలమాలలు రాష్ట్ర ప్రచార కార్యాదర్శి పుల్ల మల్లయ్య* వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హిందువుగా పుట్టి…

Read More

ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!

https://epaper.netidhatri.com/ ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి! తెలంగాణ కు నీరే ఆధారం..ఆ నీరు లేక దశాబ్దాల పాటు విలవిల లాడిన జనం గొంతు తెడపడమే, కాదు ఎండిన నేలమ్మ దాహం తీర్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. అంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే `మిషన్‌ కాకతీయ ఒక విప్లవం. `ఊరి చెరువులు గ్రామీణ ఆర్థిక వనరులు. `కుల వృత్తులకు కల్పతరువులు…

Read More

యువత జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్.

జడ్పిటిసి, గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ తమ స్వార్థ రాజకీయాల కోసం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.మొన్నటి వరకు గ్రూప్ 2ను వాయిదా వేయాలని డిమాండ్ చేసిన వీళ్లే ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ యువతా, తస్మాత్ జాగ్రత్త.ఇలాంటి నీచ రాజకీయ నాయకుల కుట్రలకు, కుతంత్రాలకు తెలంగాణ యువత బలి కావొద్దు అన్నారు….

Read More

కేకే 5గనిని సందర్శించిన ఏరియా జిఎం

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ ఏరియాలోని కేకే 5గని పని స్థలాలను శనివారం ఏరియా జిఎం ఏ మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా గని ఉద్యోగుల భద్రత, సామర్థ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మైనింగ్ కార్యకలాపాల సంబంధించి వివిధ అంశాలను నిశితంగా పరిశీలించి, అంచనా వేశారు. గనిలో మైనింగ్ కార్యకలాపాలు, భద్రత, ఉత్పత్తి, ఇతర అంశాలు ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలే వ్యూహాలు, పరిష్కారాలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లప్పుడూ రక్షణతో…

Read More

బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్

పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి, భద్రాచలం టౌన్.స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించినటువంటి ప్రెస్మీట్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల లోను బిఆర్ఎస్ పార్టీ విజయం చెందుతుందని, భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ నియెజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ను అత్యధిక ఓట్ల…

Read More

విశ్వక్రీడల్లో క్రికెట్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

క్రికెట్‌ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028లో లాస్‌ ఏంజిలెస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్‌ చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటు కల్పించారు. చివరగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో…

Read More

రామాయంపేట శివారులో నగదు పట్టివేత.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ 2023లో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రామాయంపేట పోలీసులు అక్కన్నపేట గ్రామ శివారులో వాహన తనిఖీ చేస్తుండగా కుమ్మరి సౌందర్య గ్రామం ఝాన్సీ లింగాపూర్ అను ఆమె 90 వేల రూపాయలు నగదు తీసుకొని వెళ్తుండగా, ఎలక్షన్ నిబంధనల ప్రకారం 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకుపోకూడదు కాబట్టి నగదును స్వాధీన పరుచుకుని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మోనిటరింగ్ కమిటీ నందు సమర్పించడం జరిగింది.

Read More

సామూహిక నిధి విపత్సాహాయం అందజేత

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు తంగెళ్ల ఎల్లయ్య గత కొన్ని రోజులుగా క్రితం మృతిచెందాడు.కాగా శనివారం సంఘం అధ్యక్షుడు గంగిడి రాజిరెడ్డి అధ్యక్షతన పాలకవర్గం దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ తో కలిసి సామూహిక నిధి పథకం విపత్సాహాయం రూ.60 వేలు,అభయనిధి పథకం విపత్సాహాయం రూ.10 వేలు మొత్తం 70 వేల రూపాయలు మృతిని బార్య స్వరూపకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు…

Read More

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గో నూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ కోశాధికారి దాచ శివకుమార్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు నేడు అమ్మవారికి గౌరీ దేవి అలంకరణ 16న అన్నపూర్ణాదేవి అలంకరణ 17న బాలా త్రిపుర సుందరి దేవి…

Read More

బి, ఆర్, ఎస్, పార్టీలో చేరిన బోడగుట్ట నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రోజుకొక పార్టీ మారుతున్న రాజపూర్ మండలనికి చెందిన పలు గ్రామాల ప్రజలు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రాజాపూర్ మండలంలోని బోడగుట్టతండాకి చెందిన కొందరు, నాయకులు కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీలో చేరమని తెలిపారు. వారు తిరిగి సర్పంచ్ సేవ్యనాయక్ ఆధ్వర్యంలో, బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి…

Read More

లక్షేట్టిపేటలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

  లక్షేటిపేట (మంచిర్యాల) నేటి దాత్రి: లక్షేట్టిపేట మండలంలోని జేండావేంకటపూర్ గ్రామంలోని ప్రజలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు శనివారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 20 మందికి ఆపరేషన్ అవసరం ఉందని గుర్తించారు.వీరికి బస్ సౌకర్యం కలిపించి కరీంనగర్ లోని రేకుర్తిలోని కంటి ఆసుపత్రి కి తరలించి ఉచితంగా ఆపరేషన్ చేయించి కంటి అద్దాలు, ముందులు అందజేస్తామని అన్నారు.అదేవిధంగా…

Read More

బిఆర్ఎస్ సర్కార్ హైట్రిక్ ఖాయం

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డి చేర్యాల నేటిధాత్రి… జనగామ జిల్లా కేంద్రంలో 16వ తేదీన సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు చేర్యాల పట్టణంలో ఏర్పాట చేసిన విలేఖరుల సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మూడోసారి…

Read More
error: Content is protected !!