నిజాంపేట: నేటి ధాత్రి
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ, నస్కల్, కల్వకుంట, నిజాంపేట గ్రామాలలో హెల్త్ సబ్ సెంటర్ లో పారిశుద్య కార్మికులకు మండల ఎంపీడీవో రాజు రెడ్డి, పీహెచ్సీ డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కార్మికులకు సబ్బులు, గ్లౌజులు, నూనె అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు నర్సింలు మమత, ఏఎన్ఎం రేణుక తదితరులు పాల్గొన్నారు.