చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల స్థానిక బస్టాండ్ ఆవరణంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలోఈ నెల 28 వ తేదీన నిర్వహించే మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చిట్యాల మండల పారా లీగల్ వాలంటీర్ ఆరేపల్లి తిరుపతి అన్నారు.ఈ సందర్భంగా ఆయన చిట్యాల మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేంచి మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులు,సివిల్ మరియు క్రిమినల్ కేసులు మరియు ఎక్సైజ్,భార్య భర్తల కేసులు యాక్సిడెంట్ కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా కాలయాపన కాకుండా సత్వర న్యాయం అందించడం జరుగుతుందని, ప్రజల అందరు ద్వేష భావాలను తగ్గించుకుని, కేసుల్లో రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని, రణం కంటే రాజీనయం అని తద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వాడుకుని పెద్ద సంఖ్యలో కేసులు రాజీ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండలంలోని ప్రజలు పాల్గొన్నారు…