పరకాల నేటిధాత్రి
శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బుధవారం రోజున పరకాల రూరల్ మండల అధ్యక్షులు ముష్కే దేవేందర్ ఆధ్వర్యంలో దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం బిజెపి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి ప్రతి బూతులో 100 సభ్యులను చేర్చడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణరావు,బిజెపి జిల్లా నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల పరామర్శ
పరకాల రూరల్ మండలం మల్లక్కపేట గ్రామంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు రంగు రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జా సత్యనారాయణ రావు,బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణ చారి,పరకాల రూరల్ మండల అధ్యక్షులు ముష్కే దేవేందర్,బిజెపి నాయకులు,కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి నివాళులర్పించారు.