•సోమలింగారెడ్డి
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విత్తనాలు, ఎరువులు, మందులు వినియోగదారులకు ప్రభుత్వ ధరలకే కొనుగోలు చెయ్యాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రం లో గల మారుతి, జగదాంబ, అయ్యప్ప ఫర్టిలైజర్ షాపులలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు ఎప్పటికప్పుడు కొనుగులు జరుగు వివరాలను రిజిస్ట్రార్ లో పొందు పర్చులన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు జరపాలని సూచించారు. వివిధ కంపెనీలకు చెందిన పురుగు మందుల నమునాలను సేకరించి పరీక్ష కొరకు హైద్రాబాద్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుందన్నారు.