మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు ఆట పాటలలో కూడా రాణించాలి అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పీఈటీలు మండల స్థాయిలో గెలిచిన విధ్యార్థులుకు మంచి శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయిలో అత్యధికంగా అవార్డులు వచ్చేలా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు.మండల విద్యాశాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ పోటీలలో గెలవడం ముఖ్యం కాదని పాల్గొనడం ముఖ్యమని అన్నారు.మున్సిపల్ కమిషనర్ కే నరసింహ మాట్లాడుతూ క్రీడలు దేహ దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలగి ఉత్సాహంగా ఉంటారని అన్నారు.అనంతరం మండల క్రీడా కార్యదర్శి సంధి కరిత క్రీడాకారులను అథిదులకు పరిచయం చేశారు.ఈకార్యక్రమంలో స్థానిక యస్.ఐ రమేష్,నోడల్ ప్రధానోపాధ్యాయులు నామాని సాంబయ్య గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ మధు,సి.హెచ్ సురేందర్,గౌస్ పాషా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పీడీ రజిత, పీఈటీలు శ్యామ్,కరుణ, వెంకటేశ్వర్లు,విధ్యార్థులు పాల్గొన్నారు