
రో హౌస్‌లపై నేటిధాత్రి మరో అక్షర విజయం!
`అక్రమంగా, అనుమతులు లేని రో హౌస్ లు గతంలోనే నాలుగు కూల్చివేత. `మిగిలిన రెండు నేడు కూల్చేశారు. `72 రో…
`అక్రమంగా, అనుమతులు లేని రో హౌస్ లు గతంలోనే నాలుగు కూల్చివేత. `మిగిలిన రెండు నేడు కూల్చేశారు. `72 రో హౌస్ లపై అక్రమంగా పై అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు. `15 రోజులలో కూల్చి వేసుకోవాలని ఆదేశాలు. `గడువు దాటితే తామే కూల్చేస్తామని మునిసిపల్ శాఖ హెచ్చరికలు. `మొత్తం రో హౌస్ లు కూల్చివేయాలనేది నేటిధాత్రి ప్రధాన డిమాండ్. `కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి కార్మికులకే సొంతం కావాలి. `అక్రమంగా జొరబడిన గద్దలు ఖాళీ…
`రాజాసింగ్ రాజీనామా ఆమోదం పొందితే గోషామహల్ ఖాళీ. `రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పై చేయి సాధించేనా! `రెండు గెలిచి కాంగ్రెస్ కు తిరుగులేదని నిరూపించేనా! `ఇప్పటికే కంటోన్మెంట్ గెలిచిన బలం కొనసాగేనా! `రెండు చోట్ల గెలిచి హస్తం హవా చూపేనా! `ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు బీఆర్‌ఎస్ దేనా? `బీఆర్‌ఎస్ పార్టీ చెప్పేది నిజమౌనా! `కారు గేరు మార్చేనా..పరుగందుకునేనా! `కమలం తెలంగాణలో ఊపందుకునేనా! `బీజేపీ రెండు గెలిచి వచ్చే ఎన్నికలకు సై అనేనా! `తెలంగాణకు మేమే…
రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి’ జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: అధికారులు ఏ ఆదేశాలు జారీచేసిన వాటిని ఎంత కష్టమైనా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కష్టపడడంలో రేషన్ డీలర్లు ఎప్పుడు ముందుంటారని కోహీర్ మండల రేషన్డీలర్ల సంఘం అధ్యక్షుడు గరుగుబాయి అశోక్ తెలిపారు. ప్రభుత్వాలు రేషన్ పంపిన విషయాన్ని చెప్పుకుంటున్నాయంటే కారణం దాని వెనుక ప్రభుత్వ అధికారుల తర్వాత రేషన్డీలర్లే అని అన్నారు. వారి కృషిని ప్రభుత్వం గుర్తుంచి కమిషన్ అమలుచేయాలని కోరారు.
*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం.. -కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు.. తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల 3, 4 తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి…
బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా బండమీది వెంకటయ్య శంకర్‌పల్లి: నేటి ధాత్రి: శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటయ్య బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండమీది వెంకటయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు…
మల్లయ్య దర్శనం కోసం అడవి శాఖ అనుమతి. అచ్చంపేట నేటి ధాత్రి: బజరంగ్ దళ్ అచ్చంపేట ఆధ్వర్యంలో మంగళవారం నాగర్ కర్నూల్ DFO రోహిత్ గోపిరేడీని కలిసి తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శన నిమిత్తం అటవీ అనుమతి కొరకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా భజరంగ్ దళ్ అచ్చంపేట సంయోజక్ శివ చంద్ర గౌడ్ మాట్లాడుతూ..ప్రతి ఏటా తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శనం చేసుకోవడం ఈ ప్రాంత…
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి ప్రస్తుతం వర్షాలు పడి మొక్కలు నాటడానికి అనువైన సమయమైనందున మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని నర్సరీలలో పెంచిన మొక్కలు ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి ప్రతి మొక్క ఏనుకునేలా చూడాలని యంపీడీఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం అంగన్వాడీ సెంటర్లో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమం లో…
తహశీల్దార్ కార్యాలయం ముట్టడి జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ మున్సిపల్ హోతి(కె)లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, అధికారులు 20 రోజుల్లో ఇస్తామన్న హామీ నిలబెట్టుకోక పోవడంతో నిరసిస్తూ మంగళవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి బైటాయించిన సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది, స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని కూర్చోవడం జరిగింది. తాహసిల్దార్…
స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహణ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించారు. గ్రామీణ 2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాల్లో ర్యాంకింగ్ ఇవ్వడా నికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించి స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా హుస్సేన్ పల్లి, ఆరేపల్లి, నర్సింహులపల్లి వెరిఫికేషన్ గా పర్యటించి గ్రామాల్లో ఉన్నటువంటి తడి పొడి చేత్త నిర్వహణ ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్ గ్రామపంచాయ తీలో పనితీరు, మరుగుదొడ్ల నిర్వహణ…
విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి రూరల్ మండలం గొల్లబుద్దారం గ్రామానికి చెందిన రత్నం సుధాకర్ S/. మల్లయ్య అనే రైతు దుక్కిటేద్దు రోజు వారి లాగే మేతకు వెళ్ళింది ఎస్సీ కాలనీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగలు వేలాడి ఉండటం తో కరెంట్ షాక్ కు గురైన దుక్కిటేద్దు అక్కడే మృతి చెందింది ఆ ఎద్దు విలువ 1,00,000/- లక్ష రూపాయల వరకు ధర ఉంటుంది రోజు వారి కూలి పనులు…
ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం .. జహీరాబాద్ నేటి ధాత్రి: జే.జే.కన్స్ ట్రక్షన్స్ అధినేత జావిద్ గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి గ్రామాలల్లో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయించాలని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందరు పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయడం,దోమల నివారణ మందు పిచికారి చేయడం ఆయిల్ బాల్స్…
రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ ఎదురుచూస్తున్న… యువత నిరుద్యోగులు వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి : వీణవంక మండల కేంద్రంలో బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు హొల్లాల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు…
పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం రాజకీయ నాయకులు పరామర్శ మాకు న్యాయం చేయాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామానికి చెందిన రాస మల్ల కోమల పురుగుల మందు తాగి ఆత్మయత్నం చేసుకుంది. సుదర్శన్ రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం మా మేనకోడలు అగు కోమల గత నాలుగు సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం రాయపర్తి గ్రామానికి చెందిన మచ్చ సైదులు కీచ్చి వివాహం జరిపించారు వివాహ సమ యంలో 5…
రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి రామన్నపేట అఖిలపక్ష నాయకులు రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట నియోజకవర్గం ఏర్పడాలని మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన సమితి రెండవ సమావేశానికి రెబ్బసు రాములు అధ్యక్షతన వహించగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రామన్నపేట నియోజకవర్గం 1952లో ఏర్పడినది నాటి నుంచి రామన్నపేట నియోజకవర్గంలో వలిగొండ మోత్కూరు ఆత్మకూరు గుండాల మండలాలు ఉండేవి…
కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత వికారాబాద్/ హైదారాబాద్ నేటిధాత్రి: సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగా చి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు.ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.ఈ దుర్ఘటనకు…
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు వనపర్తి లో వార్డుల పర్యటనలో బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ వనపర్తి నేటిదాత్రి : మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదే శాల మేరకు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను ఉత్తజ పరుస్తూ వనపర్తి లో పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ పార్టీ నేతల తో కలిసి 5…
*అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి.. కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01: నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45 వ వార్డు లోని శివజ్యోతినగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలని, అంధుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్,…
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ఇళ్లు కేటాయిస్తూ మంజూరుపత్రాలు జారీచేసినా ఇళ్లను అప్పగించడంలేదని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన అధికారులు ఈనెల 7వ తేదీలోపు ఇళ్లతాళాలు లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్దిదారులకు తాళాలు ఇవ్వనిపక్షంలో ఆందోళన చేపడతామని సీపీఎం నాయకుడు మహిపాల్ హెచ్చరించారు.
అప్పులున్నా హామీలు నెరవేరుస్తున్నాంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01: ఎన్నికల హామీలను ఏడాదిలోనే 85శాతం నెరవేర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భరోషా పెన్షన్లను మూడువ డిజవన్ లోని ప్రగతీనగర్ లో ఎమ్మెల్యే లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులతోపాటు సిపిఐ నాయకులు పెంచలయ్య పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రధాన డ్రైనేజీ కాలువ ఎత్తు తక్కువుగా ఉండటంతో మురుగు నీరు…