వీణవంక,( కరీంనగర్ జిల్లా ).
నేటి ధాత్రి:హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడూ తాను ఎప్పుడు అండగా ఉంటానని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు.
“నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుంటే నేరుగా నన్ను సంప్రదించండి. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉండటం నా బాధ్యత,” అని ఆయన పేర్కొన్నారు.
వీణవంక, హుజురాబాద్ మండలాల్లో వివిధ గ్రామాలకు స్వయంగా వెళ్లి మొత్తం 18 లక్షల రూపాయల విలువైన 78 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వీణవంక మండలంలో 42 చెక్కులు, హుజురాబాద్ రూరల్‌లో 26 చెక్కులు, హుజురాబాద్ టౌన్‌లో 10 చెక్కులు అందజేశారు.
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద మెరుగైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తానని, అలాగే బాధితులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారి భరోసా పటిష్టం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, వీణవంక మండల మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, మాజి జడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కొండల్ రెడ్డి, హుజురాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య,మాజి జెడ్పిటిసి బక్క రెడ్డి, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.