గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఇటీవల జరిగిన బదిలీ పదోన్నతుల ప్రక్రియలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా కోరం శాంతరావు జడ్పీఎస్ఎస్ ఆళ్లపల్లి వచ్చారు. ఆళ్లపల్లి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గా ఉంటూనే మండల నోడల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యత నిర్వహించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు తో కోరం శాంతరావు ఆళ్లపల్లి ఏంఈఓ పదవి భాద్యతలు స్వీకరించారు.ఈ విషయం తెలుసుకున్న ఆళ్లపల్లి మండల టీచర్స్ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మర్కొడ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ బాబూలాల్,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరోజినీ, శాంతివిద్యానికేతన్ టీచర్స్,యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి హతీరామ్,టీఎస్ టీటీఎఫ్ మండల అధ్యక్షులు ఇస్లావత్ నరేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,సిఆర్పి లు ఐఈఆర్పి లు ఏంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.