ప్రతిభ కనబర్చిన డిగ్రీ కళాశాల (అటానమస్) విద్యార్థినులు.

నర్సంపేట,నేటిధాత్రి :

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భముగా వరంగల్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం వారు నిర్వహించిన వివిధ పోటీలలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ తెలిపారు. పోస్టర్ ప్రెసెంటేషన్ లో బి.ఏ మొదటి సంవత్సరం విద్యార్థిని యం.డి.హర్షిన్ మొదటి స్థానం, బి.ఎస్.సి (బి.జెడ్.సి) రెండవ సంవత్సరం విద్యార్థిని పి.శిరీష్మా రెండవ స్థానం, వ్యాస రచన పోటీలలో బి.ఎస్.సి (యం.పి.సి) తృతీయ సంవత్సరం విద్యార్థిని ఏ.రచన మొదటి స్థానం, బి.ఎస్.సి (బి.జెడ్.సి) రెండవ సంవత్సరం విద్యార్థిని బి.హర్షిత రెండవ స్థానం సాధించారని మరియు వరంగల్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయ అధికారిని యం.శారదా మరియు డి.యం.హెచ్.ఓ డాక్టర్ వెంకటరమణ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారని తెలిపారు.కాగా సోమవారం కళాశాలలో విజేతలందరికి అభినందన సభ ఏర్పాటు చేసి కళాశాల ప్రిన్సిపాల్ మహిళా సాధికారత సెల్ కన్వీనర్ డాక్టర్ టి.సుమతి, సభ్యులు డాక్టర్ జి.ప్రసూన, యం.శైలజ,విద్యార్థులకు ప్రోత్సకాలు అందించి  అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *