మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్
మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నాగరాణి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మలేరియా వ్యాధి దోమల వల్ల వస్తుందని, దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా చూసుకోవాలన్నారు. అలాగే దోమల నివారణ కోసం మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలన్నారు. పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు, కొబ్బరి బొండాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఓరి ట్యాంకులు, సంపులు నీటితోట్ల మీద మూతలు పెట్టుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. దోమతెరలను వాడాలని, నీటి నిల్వలో ఆయిల్ బాల్స్ వినియోగించుకోవాలని, ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే దగ్గరలో ఉన్న ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని, లేకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రావాలని సూచించారు. అదేవిధంగా ఈరోజు అమ్మ కోసం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. నెలనెలా వారు పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలి. ఎప్పుడు ఆరోగ్య కేంద్రానికి రావాలో సూచించారు. ప్రతి గురువారం అమ్మకోసం కార్యక్రమం ఉంటుంది కాబట్టి బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ఎం ఎల్ హెచ్ పి, సూపర్వైజర్ సునీత, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత, పీహెచ్సీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *