సూపర్‌ కలెక్టర్‌ సంతోష్‌!

`సిన్సియర్‌, సెన్సిటివ్‌, డైనమిజమ్‌.

`ప్రజా సేవలో గొప్ప విజయాలు.

`తక్కువ సమయంలోనే మంచి పేరు.

`అవినీతిని అస్సలు సహించరు.

`జిహెచ్‌ఎంలో విప్లవాత్మక నిర్ణయాలు, అధ్భత ఫలితాలు.

`స్వఛ్ఛ హైదరాబాదుకు అనేక అవార్డులు.

`సానిటేషన్‌ వ్వవస్థలో సమూల మార్పులు.

`బస్తీ దహఖానలతో పేదలకు వైద్య సేవల కల్పనకు శ్రీకారాలు.

`సుస్తిలేని సమాజ నిర్మాణం కోసం ఫలించిన ప్రయత్నాలు.

`కరోనా సమయంలో ఉచిత భోజన ఏర్పాట్లు.

`ప్రభుత్వం నుంచి అనేక ప్రశంసలు.

`కొత్తగా మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు.

`ఎంతటి సవాళ్లనైనా సరే సునాయాసంగా పరిష్కారం.

`ఇక అవినీతి పరులకు చుక్కలు కనిపించడం ఖాయం.

`గతంలో జరిగిన తప్పులకు తవ్వకాలు జరపాలని ప్రజల నుంచి విజ్ఞాపనలు.

`నిధుల దుర్వినియోగం మీద దృష్టి సారించాలి.

`ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై ఉక్కుపాదం మోపాలి.

`అక్రమాలకు చెక్‌ పెట్టాలి.

`ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి భరతం పట్టాలి.

`ప్రజా ధనం లూఠీ కాకుండా చూడాలి.

………………….జీవితంలో అనుకున్న లక్ష్యాలను అధిరోహించడంలో వుండే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇష్టపడిన జీవితాన్ని కష్టపడి ల మల్చుకోవడం అంటే అందరివల్ల సాధ్యమయ్యే పని కాదు. అందుకు అకుంఠిత దీక్ష కూడా కావాలి. లక్ష్య సాధన కోసం ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, చిరునవ్వుతో వాటిని ఎదుర్కొని గమ్యం చేరగలగాలి. మధ్యలో విశ్రమించడం, విరామం తీసుకుంటా అంటే కుదరదు… విద్యావంతులు కావడం వేరు…మన దేశంలోనే అత్యున్నతమైన పరీక్షలలో విజయాలు సాధించి లక్షల్లో ఒకరుగా గెలిచి నిలవడం వేరు. అలాంటి విజయం ఊరికే రాదు… రాత్రింబవళ్ళు పడే కష్టానికి ప్రతిరూపం. మన దేశంలో అంతటి గొప్ప గౌరవం ఒక్క సివిల్‌ సర్వీసెస్‌ కే వుంటుంది. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి…పోతుంటాయి…ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో లక్ష్యం వుంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతలు నిర్వర్తించడమే కాదు, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ప్రతి గడపకు చేరేందుకు కృషి చేసే వ్యవస్థ సివిల్‌ సర్వీసెస్‌ విభాగానిది. మారుతున్న కాలానికి అనుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులు, అందివచ్చే అవకాశాలు, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, ప్రభావితం చేసే కొత్త కొత్త అంశాలు, టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తలకు మించిన భారమే…అయినా చెరగని చిరునవ్వుతో ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ, ఒత్తిళ్లను అధిగమిస్తూ, ప్రజలను మెప్పిస్తూ, పాలకులు చేసే చట్టాలను అమలు చేస్తూ ప్రతి క్షణం కొత్త ఉత్సాహంతో పని చేసే వారే ఐఏఎస్‌ లు. అలాంటి వారిలో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సాధించిన ఐఏఎస్‌ అధికారులలో ధరావత్‌ సంతోష్‌ ఒకరు. ఎలాంటి వివాదాలు లేకుండా, అవినీతికి తావులేని అధికారిగా మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే ఎంతో కష్టమైన విధుల నిర్వహణలో సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలందుకుంటున్నారు. 2016 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ధరావత్‌ సంతోష్‌ ది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషను ఘనపూర్‌ పక్కన వుండే తండా. చిన్నప్పటి నుంచి ఉన్నతమైన భావాలు కలిగి, జీవిత లక్ష్యం మీద అవగాహన కలిసి, పరిస్థితులను తనకు అవకాశాలుగా మల్చుకొని ఎదిగారు…సివిల్‌ సర్వీసెస్‌ లో విజయం సాధించారు. జిహెచ్‌ఎంసిలో సానిటేషన్‌, మెడికల్‌ డిపార్ట్మెంట్‌ కు హెడ్‌ గా పోస్టింగ్‌ లో ఆయన సాధించిన విజయాలు అమోఘం. ఇటీవలే మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టారు……………………………..

 

ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ జిహెచ్‌ఎంసిలో హెల్త్‌ అండ్‌ సానిటేషన్‌ విభాగంలో అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి, అధ్భుతమైన విజయాలు అందించారు. నగరం సుందరంగా, ప్రజలు ఆరోగ్యంగా, పరిసరాలు పరిశుభ్రంగా, సమాజం సంతోషంగా వుండడానికి ఎంతో దోహదపడ్డారు. ముప్పై సర్కిళ్లు ఆయన ఆధ్యర్యంలో వుండేవి. సమారు 22వేల మంది సానిటేషన్‌ సిబ్బందితో నగరం సుందరంగా తీర్చిదిద్దడంలో తనదైనముద్ర వేశారు. అంతకు ముందు లేని కొత్త కొత్త ఆలోచనలతో నగరంలోని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడం కోసం ఆయన అనుసరించిన మార్గం అనేక రాష్ట్రాలకు ఇప్పుడు అనుసరణీయమైంది. తెలంగాణ మొత్తం అమలు పర్చడంలో కూడా కీలకపాత్ర వహించింది. నగరంలోని ఆయన పరిధిలో వున్న ముప్పై సర్కిళ్లలో సుమారు 6500 వెయికిల్స్‌ ఏర్పాటు చేసి, నిత్యం చెత్త సేకరణకు శ్రీకారం చుట్టడంతో సంతోషది ప్రత్యేక పాత్ర. వీటితోపాటు నగరంలో సేకరించిన చెత్తను జవహర్‌ నగర్‌కు తరలించేందుకు మరో 1600 వాహనాలు వినియోగించి, ఎప్పటికప్పుడు నగరంలోని చెత్తను శివారు ప్రాంతానికి తరలించి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందకు ఎంతో కృషి చేశారు. ప్రజలను రోగాల బారిన పడుకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలకభూమిక పోషించారు. సంతోష్‌ జిహెచ్‌ఎంసిలో విధుల్లో చేరకముందు జవహర్‌ నగర్‌లో చెత్త నిక్షిప్తం చేయడాన్ని డంపింగ్‌ యార్డు అనే సంబోధిస్తుండేవారు. కాని ఆ మాటను సంతోష్‌ మార్చారు. అక్కడి పరిస్ధితులు చక్కదిద్దారు. అక్కడి ప్రజలకు పడుతున్న వేధన నుంచి విముక్తి చేశారు. గుట్టల్లా పేరుకుపోయిన చెత్తతో జవహర్‌నగర్‌లో జీవించే ప్రజలు నిత్యం నరకం అనుభవించేవారు. దుర్వాసనతోపాటు, ఈగలు, దోమలు, పొగతో నిత్యం నరకం అనుభవించేవారు. నీటి కాలుష్యం, వాయుకాలుష్యంతో నిత్యం సతమతయ్యేవారు. రోగాల బారిన పడుతూ వుండేవారు. ఇక జవహర్‌నగర్‌లో బతకలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లినవారు వున్నారు. కాని ఎప్పుడైతే సంతోష్‌ బాధ్యతలు చేపట్టారో…అక్కడి ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అందమైన జవహర్‌ నగర్‌ తయారైంది. గ్రామ పంచాయితీ కాస్త కార్పోరేషన్‌ స్ధాయికి ఎదిగింది. జవహర్‌ నగర్‌ విస్తరించింది. అందుకు సంతోష్‌ చేపట్టిన విధానాలే కారణం. ఒకనాడు డంపింగ్‌ యార్డు స్ధలాన్ని నేడు ట్రీట్‌ మెంటు ప్లాంటుగా మార్చివేశారు. అక్కడ కూడా అధ్భుతాలు సృష్టించారు. తడి చెత్తతో కరంటు ఉత్పత్తి చేస్తున్నారు. తర్వారా వెలువడిన దానిని కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. రైతులకు ఆ ఎరువును అమ్ముతూ, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చేశారు. ఇక పొడి చెత్త విషయంలో ప్లాస్టిక్‌ రీసైకిలింగ్‌కు పంపిస్తున్నారు. చెత్తా, చెదారమంతా పేపర్‌ యూనిట్లకు పంపిస్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేస్తున్నారు. ఇంతముందు ఆ డంపింగ్‌ అంతా ఎప్పుడూ కాలబెడుతూ వుండేవారు. దాంతో జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతాలన్నీ కాలుష్య కాసారంగా మారిపోయాయి. కాని ఇప్పుడు అదే ప్రాంతం సుందరంగా విరాజిల్లుతోంది. ఈ నిర్ణయంలో సంతోష్‌దే ప్రత్యేక పాత్ర. అంతే కాకుండా నగరంలో సుమారు 7వేల వరకు చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటినుంచి రోజుకు రెండుసార్లు చెత్త సేకరించే ఏర్పాటు చేశారు. దాంతో చెత్తడబ్బాల్లో చెత్త పేరుకుపోకుండా, ఆ పరిసరాల్లో ప్రజలు చెత్త కింద పడేయకుండా చేశారు. చిన్న వయసులోనే ఇంతటి అధ్భుతమైన ప్రతిభను కనబర్చిన అధికారులు గతంలో లేరు. ఇక జిహెచ్‌ఎంసిలో ఎదురయ్యే సవాళ్లనే, సమస్యలను ఎంతో చాకచక్కంగా పరిష్కరించడం ఆయనకున్న ప్రత్యేకత. ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుందని నమ్మే వ్యక్తిత్వం. అందుకే ఎంతటి క్లిష్ట సమస్యనైనా చాలా సునాయసంగా పూర్తి చేస్తుంటారు. పరిష్కారం కనుక్కుంటారు. అంతే కాకుండా అటు అధికారులతో సమన్వయం, ఇటు ప్రజా ప్రతినిధులు కోరిన పనులు పూర్తి చేయడం, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేధికలు సమర్పించడం, కొత్త ఆలోచనతో నగరాభివృద్ధి, సుందరీకరణ కోసం సంతోష్‌ చేపట్టిన పనులు వ్యక్తిగతంగా ఆయనకు, ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చాయి. 

    ఇదిలా వుంటే గత అధికారులకుంటే సంతోష్‌ ది భిన్నమైన శైలి.

 సహజంగా ఐఏఎస్‌ అధికారులంటే ప్రజలకు చేరువగా వుంటారని ఎవరూ అనుకోరు. కాని ఆయన మాత్రం ఉదయం ఏడుగంటలకు ప్రజల మధ్య వుంటారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుంటారు. కార్మికులు చేస్తున్న పనులు పర్యవేక్షిస్తుంటారు. అవసరమైన సూచనలు క్షేత్ర స్ధాయిలో వుంటూనే ఇస్తుంటారు. స్ధానిక నేతల అభిప్రాయాలు సేకరిస్తుంటారు. ఆయా కాలనీలకు అవసరమైన సేవలను తెలుసుకుంటారు. వాటిని అమలు చేస్తారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూసుకుంటారు. ఇదే ఆయన విజయానికి కారణమైంది. నగరంలోని సానిటేషన్‌ విభాగం పూర్తి స్ధాయిలో ప్రక్షాళన జరగడమే కాదు, అధ్భుతమైన అందమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను తీర్చిదిద్దిన ఘనత సంతోష్‌కే దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ మహానరగర పాలక సంస్ధకు ఏటా కొన్ని పదలు సంఖ్యలో అవార్డులు సంతోష్‌ వచ్చిన తర్వాతే రావడం మొదలైంది. అంతకు ముందు వచ్చినా, పదలు సంఖ్యలో వచ్చేవి కాదు…నగరంలో ప్లాస్టిక్‌ వినియోగం మీద నిఘా ఏర్పాటు చేసి, దాని వినియోగాన్ని తగ్గించేందుకు కృషిచేశారు. ముఖ్యంగా ప్రజల్లో కూడా ప్లాస్టిక్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాలను విజయం వంతం చేశారు. కులీకుబ్‌షా అర్భన్‌ డెవలప్‌ మెంటు కార్యక్రమాలను కూడా ఎంతో విజయంతంగా చేపట్టారు. ఇక నగరంలోని పేదల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో బస్తీ దవాఖానాల ఏర్పాటులో కీలకభూమిక పోషించారు. ఇప్పుడు నగరంలో దాదాపు 263 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఆయన ఆయన విధుల్లో వున్నప్పుడు సమారు 79కి పైగా బస్తీ దవఖానాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఆరోగ్య కల్పనకు కృషి చేశారు. వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పేదలకు ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నంలో విజయం సాధించారు. పజలకు ఐదు రూపాయల భోజన స్టాల్స్‌ను మూడు వందల వరకు ఏర్పాటు చేయయడంలో ఎంతో చొరవ చూపారు. ప్రజలకు భోజన వసతి కల్పించారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలను నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్న కూలీలకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. నగరంలో వరదల సమయంలో ప్రతి కుటుంబానికి రేషన్‌ సరుకులు ఇంటింటికి తిరిగి అందించే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇదంతా ప్రభుత్వ ఆదేశాలతో చేపట్టినా, ఆచరణలో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే…దాంతో ప్రజలకు ప్రభుత్వ మెరుగైన సేవలు అందాలంటే సంతోష్‌ లాంటి అధికారుల పని తీరు ఎంతో మఖ్యమైంది. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడమే కాదు, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడంలో కూడా సంతోష్‌ ఎంతో ముందుంటారని నిరూపించుకున్నారు. దుండిగల్‌లో కరంటు ఏర్పాటు చేయడంలో కూడా సంతోష్‌ కృషి గొప్పది. కరోనా సమయంలో వాక్సినేషన్‌ విషయంలో జిహెచ్‌ఎంసి కార్మికులకు ముందుగా ఇప్పించడంలో కీలకభూమిక పోషించారు. ఇక గతంలో మున్సిపాలిటీలలో బర్త్‌ సర్టిఫికెట్లు, డెత్‌ సర్టిపికెట్లు పొందడం ఎంతో గగనంగా వుండేది. రోజుల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివచ్చేది. అక్కడ కూడా అవినీతి జరుగుతుండేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు. బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు అదే రోజు క్షణాల మీద అందేలా అంతా ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయించారు. పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంతోష్‌ సృష్టించిన అధ్భుతాలకు, సాధించిన విజయాలకు లెక్కే లేదు. హనెస్ట్‌ ఆఫీసర్‌గా ఆయన పేరు పొందారు. 

    సమస్యల స్వాగతం: 

ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా సులువుగా పరిష్కరిస్తారనే పేరున్న కలెక్టర్‌ సంతోష్‌కు మంచిర్యాల జిల్లాలో వున్న కొన్ని సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో డిఎంఎఫ్‌టి ఫండ్స్‌ గతంలో విచ్చవడిగా ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. చేసిన పనులకు, చెప్పిన లెక్కలకు ఎక్కడా పొంతన కుదడం లేదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇక మంచిర్యాల జిల్లాలో ఇసుక తవ్వకాలకు అడ్డాగా మారింది. ఇష్టం వచ్చినట్లు గోదావరిని తవ్వేస్తున్నారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. జిల్లాలోని నస్పూర్‌ మండలానికి చెందిన ఒక వ్యక్తి డీలర్‌గా పనిచేసి, ఇసుక వ్యాపారం అడ్డం పెట్టుకొని ఆడన్‌గా ఎదగడమే కాకుండా, అధికార యంత్రాంగాన్నంతా గుప్పిట్లో పెట్టుకొని పేదల భూములను ఆక్రమించకుంటున్నారన్న విమర్శలు అనేకం వున్నాయి. బాధితులు కూడా ఇప్పటికే అనేక మార్లు సదరు వ్యక్తిపై చర్యలకు ఎన్ని సార్లు డిమాండ్లు చేసినా పట్టించుకోలేదన్నది ఇక్కడ ప్రజలు చెబుతున్న మాట. మొత్తం జిల్లా యంత్రాంగాన్నంతా చేతిలో పట్టుకొని, ప్రభుత్వం అతని వద్ద స్వాధీనం చేసుకున్న ఇసుక మళ్లీ అతనే అమ్ముకుంటుంటే కూడా చూస్తూ ఊరుకున్నారే గాని, అడ్డుకోలేదు. అతన్ని అదుపులోకి తీసుకోలేదు. ప్రభుత్వానికి అతను చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించకపోయినా అధికారులు చర్యలు తీసుకున్నది లేదన్నది ప్రజలు చెబుతున్న మాట. ఇక జిల్లాలోని మండల రెవిన్యూ కార్యాయలయాలు, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎక్కువైందన్న వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. ఆర్డీవో కార్యాలయంలో ఏకంగా ఓ ప్రైవేటు వ్యక్తి అన్ని పనులు అతనే చక్కబెడుతున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని అధికారులందరికీ తెలిసినా ఎవరూ అడ్డుకున్నది లేదు. అతని పెత్తనం గురించి ప్రశ్నించిన వారు లేరు. ఏ చిన్న పని కావాలన్నా అతన్ని కలిస్తే సరిపోతుందన్న మాటే ఆర్డీవో కార్యాలయంలో వినిపిస్తోందంటున్నారు. అలా ప్రభుత్వ భూముల అక్రమణల దగ్గర నుంచి మొదలు, ప్రభుత్వ భూముల అప్పగింతలో కూడా కీలక భూమిక పోషిస్తున్నారని అంటున్నారు. అందుకు పూర్తి స్ధాయిలో అధికార యంత్రాంగం సహాకారం వుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్ధాయి దృష్టిపెడితే, ఎన్నో విషయాలు వెలుగులోకి రావొచ్చు. ఇక ఓ ఫారెస్టు అధికారి కింది స్ధాయి మహిళా అధికారులను వేధింపులకు గురి చేస్తున్న అంశం సంచలనంగా మారింది. మహిళా అధికారులు అక్కడ పనిచేయడానికి కూడా భయపడుతున్నారని, ఆ అధికారిపై పిర్యాధులు వెల్లడం జరిగినా, పై స్ధాయిలో సందన లేకపోవడం వంటి అనేక అంశాలు వున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంగా, అవినీతి,అక్రమాలకు మాత్రం నిలయంగా జిల్లా మారిందన్న విమర్శలు వున్నాయి. వాటిని చక్కదిద్ది జిల్లా ను గాడిలో పెడతారని ప్రజలు కోరుకుంటున్నారు. ఆల్‌ బెస్ట్‌…సార్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *