ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కోంగంటి తిరుపతి అన్నారు. గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి అడ్మిషన్లు ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ కలిగిన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు,ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,యూనిఫాం ప్రభుత్వం అందిస్తోందని, అంతేకాకుండా 2026-27 ఈ నూతన విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు,విద్యార్థులకు 21 రకాల చదువుకు కిట్టు అందిస్తంది అని అన్నారు,పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ప్రైవేట్ పాఠశాల మోజులో పడి డబ్బులు వృధా చేసుకోవద్దని కోరారు.
స్పోర్ట్స్ కోటాలో వచ్చిన నూతన బీరువను,అలాగే పాఠశాల ఉపాధ్యాయురాలు శశిరేఖ మరి కొన్ని రోజులలో రిటైర్మెంట్ అవుతుండగా పాఠశాలకు బీరువాను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రెండు బీరువాలను సర్పంచ్ ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు ఆర్ ప్రణిత,ఏ.శ్రీనివాస్,బి. శంకర్,వి.శ్రీదేవి,షబానా అజూమ్,ఎన్.ఉదయ్ కుమార్,ఎస్.సురేఖ పిఈటి ప్రేమానందం పాల్గొన్నారు.
