166వ వారానికి చేరిన హోప్ ఫౌండేషన్ అన్నదాన యజ్ఞం

166వ వారానికి చేరిన హోప్ ఫౌండేషన్ అన్నదాన యజ్ఞం

​శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా హోప్ ఫౌండేషన్ చేపట్టిన అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న

ఈ అన్నప్రసాద వితరణ శనివారం విజయవంతంగా 166వ వారానికి చేరుకుంద, కార్యక్రమంలో సుమారు 2,900 మంది పేదలు, కూలీలు మరియు స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో గత 166 వారాలుగా ఈ సేవను నిర్విఘ్నంగా కొనసాగించడం మాకు ఎంతో సంతోషకరమని, కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు
తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version