ఆర్యవైశ్య ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం.

ఆర్యవైశ్య ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు ప్రయాణికులకు అండగా ఉంటూ వారికి ఎండాకాలంలో ఇబ్బంది కలగకుండా చలివేంద్రం అంబలి కేంద్రం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్య వైశ్యులు సేవా రంగంలో ముందు ఉండి ప్రజల యొక్క ఆకలి తీర్చడం చాలా సంతోషమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

166వ వారానికి చేరిన హోప్ ఫౌండేషన్ అన్నదాన యజ్ఞం

166వ వారానికి చేరిన హోప్ ఫౌండేషన్ అన్నదాన యజ్ఞం

​శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా హోప్ ఫౌండేషన్ చేపట్టిన అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న

ఈ అన్నప్రసాద వితరణ శనివారం విజయవంతంగా 166వ వారానికి చేరుకుంద, కార్యక్రమంలో సుమారు 2,900 మంది పేదలు, కూలీలు మరియు స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో గత 166 వారాలుగా ఈ సేవను నిర్విఘ్నంగా కొనసాగించడం మాకు ఎంతో సంతోషకరమని, కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు
తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version