ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్…

ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ను జంగవానిగూడెం గ్రామ సర్పంచ్ గొంది సోనీ రాజు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్‌ఐ రాజ్‌కుమార్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పండుగ వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జంగవానిగూడెం ఉప సర్పంచ్ అలెం మహేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సారంగపాణి, దారం భూపాల్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్‌రోలర్ చారి ఇతర గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version