మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన నూతన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును బుధవారము ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా రాజకీయ పరిస్థితుల గురించి, ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు రాలేదని గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినా నూతన సర్పంచ్ తదితర అంశాలపై హరీష్ రావుకు వివరించారు. తమ గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పలు ప్రజా సమస్యలను ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి హరీష్ రావును సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గ్రామ నాయకులు మరియు సర్పంచ్ మరియు పార్టీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
