భూపాలపల్లిలో ఘనంగా కైట్ ఫెస్టివల్
గాలిపటాలు ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
పండుగల ద్వారానే కుటుంబాల అనుబంధాలు మరింత బలపడతాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ భూపాలపల్లి సుభాష్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొని పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం జంగేడు – భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ టీషర్ట్ ఆవిష్కరించారు.
ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమని, పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో పిల్లలతో గడిపిన ఈ క్షణం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశాయని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని కోరుతూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సందడి చేశారు
