సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మార్వో

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న తంగళ్ళపల్లి ఎమ్మార్వో….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జరుగుతున్న జాతరకు విచ్చేసి న ఎమ్మార్వో అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం జరుగుతున్న సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో విజయ ప్రకాష్ రావు గారిని సమ్మక్క సారాలమ్మ జాతరకు రావాలని ప్రత్యేకంగాఆలయ కమిటీ సభ్యుల గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారిని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వరిలో సస్య రక్షణపై రైతులకు అవగాహన

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బృంద చర్చ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సమగ్ర సత్య రక్షణ అనే అంశంపై చర్చ. సందర్భంగా రామ్ వ్యవసాయ కళాశాల యొక్క దత్తత గ్రామమైన రాళ్లపేట రైతులకు వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ .వెంకట్రామ్. శ్రీ యశస్విని. రైతులకు వరిలో సమగ్ర సస్యరక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. రైతులు తము తమ పొలాలలో పాటిస్తున్న సస్య రక్షణ చర్యలు తమ ఎదుర్కొంటున్న పంట సమస్యల వారిని వివరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. తర్వాత .రాళ్లపేటలోని పాలు వరి పొలాలను సందర్శించి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంటుందని దాని నివారణకు తొలి దశలో ఐసో ప్రోతాయో లేన్.1.5మి.లీ. లేదా ట్రై సైక్లోజల్+మ్యామ్ కోజబ్.2.5గ్రా. లేదా కాసు గా మైసిన్.2.5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాళ్లపేట గ్రామ సర్పంచ్ పరిషరాములు రైతులు నాగరాజు ఎల్లయ్య తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తదితరులు పాల్గొన్నారు

ఇసుక కు వే బిల్లుల అనుమతులు యధావిధిగాఇవ్వాలి….

ఇసుక కు వే బిల్లుల అనుమతులు యధావిధిగాఇవ్వాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మానేరువాగునుండి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు లభించడంతో వే బిల్లుల ద్వారా ఇసుక రవాణాకు సౌకర్యం కల్పిస్తూ స్థానిక ఎమ్మార్వో వే బిల్లులు ఇవ్వడంతో ట్రాక్టర్ యజమానులము సిబ్బంది అందరం కలిసి మానేరు వాగులోని ఇసుక తీసుకొని వెళుతుండగా చుట్టుపక్కల పొలాలకుచెందిన రైతులతో చిన్న సమస్య ఏర్పడడంతో వాటిని పరిష్కారం చేసుకొని వెళ్తామని చెప్పినా కూడా వినకుండా సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చి ట్రాక్టర్లు లోడ్ చేసిన ఇసుకను మానేరు వాగులో విడిచి వెళ్లాలని ట్రాక్టర్ యజమానులతో స్థానిక ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ట్రాక్టర్ సిబ్బంది యజమానులు అందరూ కలిసి ట్రాక్టర్లు నిలిపివేసి ధర్నా చేస్తూ ఎమ్మార్వో వచ్చి తమకు యధావిధిగా వే బిల్లులకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుచున్నామనిఏదైనా సమస్య ఉంటే రైతులతో మా యజమానులు అందరం కలిసి సమస్య పరిష్కారమయ్యే దిశగా చేసుకుంటామని ఈ సందర్భంగా స్థానిక సిబ్బందిని ఎమ్మార్వో ని వేడుకుంటూ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అవసరం ఉన్నందున కట్టుకోవడానికి ఇబ్బంది అవుతున్న నేసేద్యంలో అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్నా చేస్తూ ఎమ్మార్వో వచ్చి సమస్య పరిష్కరించాలని యజమానులసంఘం సిబ్బంది ఇట్టి ధర్నా కార్యక్రమంలో తంగళ్ళపల్లి ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షులు భాస్కర్ ట్రాక్టర్ యజమానులు లేబర్స్ తదితరులు పాల్గొన్నారు

సిద్ధన్నకు బి ఆర్ ఎస్ నాయకుల నివాళులు..

బి ఆర్ ఎస్.పార్టీ సీనియర్ నాయకులు సిద్దన్న మృతదేహానికి నివాళులు అర్పించిన చిక్కాల….

 

తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేటగ్రామానికి చెందిన కీ..శే.బల్లెపునరసయ్య అలియాస్.సిద్దన్న. హత్యకు గురవడంతో స్థానిక గండి లచ్చపేటగ్రామానికి తీసుకువచ్చారు మృతదేహాన్ని స్థానిక బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ.సిద్ధన్నపార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నారని.ఇలా అకస్మాత్తుగా హత్యకు గురవడం చాలా బాధాకరంగా ఉందని వారి మరణానికి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని.అలాగే వారికి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని ఇట్టి విషయమై స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్లి తమ తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామనీ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సెస్. చైర్మన్ చిక్కాలరామారావు. టిఆర్ఎస్ ..పార్టీ మండల అధ్యక్షుడుగజబింకర్.రాజన్న. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగలరాజు తంగళ్ళపల్లి మాజీవైస్ఎంపీపీ.జంగిటి అంజయ్య.నీరటి బాబు.గ్రామస్తులు కుల బాంధవులుగ్రామస్తులుపెద్ద ఎత్తున అంతిమయాత్రలోపాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version