మూడు చింతలపల్లి పై బిఆర్ఎస్ జెండా ఎగర వేస్తాం..

మూడు చింతలపల్లి పై బిఆర్ఎస్ జెండా ఎగర వేస్తాం : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* జగన్ గూడా, ఉద్దమర్రి లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు చింతలపల్లి మున్సిపల్ కోట పై బిఆర్ఎస్ జెండా మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంపన్ బోల్, జగన్ గూడ, ఉద్దమర్రి గ్రామాలలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని కోరారు. ఉద్దేమర్రి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నవీన్, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

మునిసిపల్ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ జోరు

మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జోరు

* రోడ్డు షోల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి

* బిఆర్ఎస్ లో పలువురికి చేరిక

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు దూసుకు పోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున భారీ ఎత్తున్న రోడ్ షో లు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం తో ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండాను ఎగరావేయాలన్నారు. ఈ కార్యక్రమలలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, అభ్యర్థులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల చేరికలు..

మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లం వెంకటేష్, ఎల్లం దేవి రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 30 మంది, కొల్తురు కు చెందిన మహేష్ లకు బిఆర్ఎస్ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆది అజయ్, నాగరాజు గార్లకు ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు డా భద్ర రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రమేష్, చిరంజీవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలియాబాద్ వార్డు నెంబర్–17కు చెందిన బీజేపీ నాయకుడు తాడేం కుమార్ బిఆర్ఎస్ లో చేరగా అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముద్దం మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అనిత లాలయ్య, వంగ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన అల్లిపూర్ కాంగ్రెస్ నాయకులు

*బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన అల్లిపూర్ కాంగ్రెస్ నాయకులు*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో అల్లిపూర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 30 నాయకులు హంజా, రాజు,రవి ,కృష్ణ, అరుణ్,వినోద్,పురుషోత్తం,బన్నీ,చక్రవర్తి,మోహన్ తదితరులు చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు,దేవీప్రసాద్,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు వారికి గులాబీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,నరసింహ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,బాబు,తిరుపతి రెడ్డి, అంజన్న, నవీన్,దన్ను, యదుల్లా, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version