శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం…

శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

సుభాష్ కాలనీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో
ధర్మ ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం రాష్ట్రంలోనే మొట్టమొదట భూపాలపల్లి పట్టణం సుభాష్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… సనాతన ధర్మపరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ధర్మ ప్రచారం ద్వారా సమాజంలో నైతిక విలువలు, శాంతి ఐక్యత పెంపొందుతాయని ఎమ్మెల్యే అన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version