బిజెపి పార్టీ పై బురదల్లే ప్రయత్నం మానుకోవాలి

బిజెపి పార్టీ పై బురదల్లే ప్రయత్నం మానుకోవాలి

మహాదేవపూర్ నేటిధాత్రి

 

బిజెపి పార్టీ బీసీలను మోసం చేసిందని ఇటీవల బీసీ సంఘం డివిజన్ నాయకుడు విజయగిరి సమ్మయ్య ఆరోపణలు చేయడం బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేయడమేనని అటువంటి వ్యాఖ్యలు చేయడం వెంటనే మానుకోవాలని బిజెపి మహాదేపూర్ సీనియర్ నాయకుడు కన్నెబోయిన ఐలయ్య యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

మహాదేవపూర్ మండల కేంద్రంలో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ…. ఇటీవల బీసీ సంఘం డివిజన్ నాయకుడు విజయగిరి సమ్మయ్య బిజెపి పార్టీ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిజెపి పార్టీ అన్ని కుల,మత, సంఘాలను కలుపుకుపోయే పార్టీగా రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల అవతరించిందని అన్నారు. బిజెపి పార్టీపై బూరదల్లే ప్రయత్నం కొన్ని దుష్టశక్తులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీయే బిజెపి పార్టీ అని, ఒక బీసీ బిడ్డను దేశానికే ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘనత బిజెపి పార్టీ కే దక్కుతుందని గుర్తు చేశారు. అంతేకాకుండా గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి సంజయ్ ఒక బీసీ బిడ్డ కాదా….? అని ప్రశ్నించారు. పార్టీ ఎక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలను చేస్తామని హామీ ఇవ్వలేదని అన్నారు. సంఘాల పేరుతో పబ్బం గడుపుకునే కొంతమంది నాయకులు బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ఆలోచనలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. మీరు పని చేసే పార్టీలో ఎంత మంది బీసీ బిడ్డలు గ్రామస్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు వారికి అవకాశం కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, కనీసం మండలి చైర్మన్ గానైనా బీసీలకు అవకాశం కల్పించారా అని ప్రశ్నించారు. బిజెపి పార్టీకి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్ర రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version